2019
2019ఫిబ్రవరిలో నేను రాసి ప్రచురించిన 60 మట్టిపోగు పుస్తకాలను అనంతపురం కేంద్ర గ్రంథాలయం లో ఇచ్చా. 2019మార్చిలో కదిరి అభివృద్ధి వేదిక ను ఏర్పాటు చేశా.ఎన్నికల సందర్భంగా పోటీ అభ్యర్థులతో కదిరి అభివృద్ధి కోసం వారేం చేస్తారో చెప్పాలని కోరాం. 2019ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున అభివృద్ధి వేదికను ఏర్పాటు చేశాను అంబేద్కర్ జయంతి సందర్భంగా కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ కుమార్ స్వామి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పైకి ఎదిగాడని దళితుల సమస్యల పైన పోరాడుతూ సమాజంలో ఉన్న కులవివక్షను పోగొట్టడానికి అసమానతలను పోగొట్టడానికి అనేక పోరాటాలు చేశాడ న్నారు .రాజ్యాంగ నిర్మాతగా లౌకిక ప్రజాతంత్ర ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఆయన అభిలషించారు. కదిరి అభివృద్ధి వేదిక ను అంబేద్కర్ జయంతి తేదీని ని ప్రారంభ దినంగా తీర్మానం చేశారు. ఈ సమావేశానికి వేదిక మరో కన్వీనర్ జెవిరమణ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ ,ఎన్జీవో నాయకులు ఆత్మ రెడ్డి , లాయర్ చౌడప్ప, రైతు సంఘం నాయకులు సుబ్బ...