కరువుపై కరువులు, రచయితలు స్పందించాలి(5/4/2015)
సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
"వరుస కరువులతో అనంతపురం జిల్లాలో ప్రజల జీవనం దుర్భరంగా మారింది. రైతు ఆత్మహత్యలు, ఉపాధి కోసం వలసలు కొనసాగుతున్నాయి. వీటిపై
కరువులు, రచయితలు స్పందించాల్సిన అవసరముంది'. అని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కుమారస్వామి
ఆధ్యక్షతన ఆదివారం నాడు "ప్రజాశక్తి కార్యాలయం లో సాహితీ సమయం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏ.రాంభూపాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయిప్రసంగించారు.
వరుస కరువులతో అనంతపురం జిల్లాలో ప్రజల జీవనం అస్థవ్యస్థంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు సాగునీరు, తాగునీటి వసతి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన
దుస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఇటువంటి సమయంలో కవులు, రచయితలు జిల్లా పరిస్థితుల పై తమ కలాలకు పదును పెట్టాల్సిన అవసరముందని
పిలుపునిచ్చారు. తేమ కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ప్రభుత్వాల తీరును ఎండగట్టే విధంగా ఉండాలనీ సూచించారు. దీనికి సాహితీ
స్రవంతి సభ్యులు స్పందిస్తూ కష్టాల్లోనున్న ప్రజల తరుపున తాము నిలబడేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. రైతులు, వ్యవసాయ కూలీల తరుపున నిలబడి రచనలుసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత జెట్టి జయరాం, సురేష్ గంగాదేవి, బాలభారతమ్మ, సూర్యనారాయణరెడ్డి, నవీన్ కుమార్, చంద్రశేఖర్,సుజాత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెండవ జిల్లా కమిటీ ఏర్పడ్డాక అనంత్ కవితా స్వరాలు కవితా సంకలనం ప్రచురించాము.ఇందు లో 71 మంది కవుల కవితలున్నాయి.దీనికి మల్లెల నరసింహమూర్తి ~ పిళ్లా కుమారస్వామి సంపాదకత్వం వహించారు.
ఈ కవితా సంకలనాన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పరిచయం చేస్తున్న సందర్భంలో కదిరి~ హిందూ పురం~ ఉరవకొండ ~ ధర్మవరం ప్రాంతాలలో నూతన కమిటీ లు ఏర్పడినాయి.ఈకమిటీలు జాషువా వర్ధంతులను గురజాడ జయంతులను జరిపాయి.
అనంత పురంలో నెలనెలా ప్రారంభంలో పిళ్లా కుమారస్వామి నివాసం లో తరువాత ప్రజాశక్తి కార్యాలయం లో నూ సాహితీ సమయం పేరుతో కవుల సాహిత్య గోష్టి నిర్వహించాము. నగర కమిటీ కూడా ఏర్పడింది.
Comments
Post a Comment