కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై మోడీ స్పందించాలి.
*కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై మోడీ స్పందించాలి.* కడప అంబేద్కర్ సర్కిల్ లో సిపిఎం నిరసన. అమరావతి పర్యటన సందర్భంగా వెలగపూడి లో పర్యటించనున్న నరేంద్ర మోడీ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై స్పందించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ. రామమోహన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో *అమరావతి పర్యటన సందర్భంగా మోడీ కడప ఉక్కు నిర్మాణంపై స్పందించాలని* డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ విభజన చట్టంలో స్పష్టంగా కడప ఉక్కు నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో కడప జిల్లా పరిషత్తు ఆవరణలో టిడిపి నేతలు ఉక్కు దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన కూటమినేతలు ప్రస్...