Posts

Showing posts from November, 2022

రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్యం పై లిటరరీ ఫోరం

రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్యం పై లిటరరీ ఫోరం         కేంద్ర సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్తంగా రాహుల్ సాంకృత్యాయన్ రచనలపై 6.11.22, ఆదివారం నాడు సాహిత్య సమావేశాన్ని స్థానిక యు. టి. ఎఫ్. భవనంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ఈయన మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ తన జీవితమంతా పర్యటిస్తూ భారత దేశ సామాజిక సాంస్కృతిక వారసత్వాన్ని తన రచనల్లో శాస్త్రీయంగా పొందుపరిచారన్నారు. ఆయన భారతీయ ఆత్మను తన రచనల ద్వారా తెలియజేశారన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డా. కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ దాదాపు 40భాషల్లో ప్రావీణ్యత కలిగిన పండితుడని, ఆయన 140 పైగా రకరకాల సాహిత్యాన్ని మనకందించి వెళ్లాడని అన్నారు. ఆయన జీవితమంతా పర్యటిస్తూ ఆయన అనుభవాల ద్వారా అనేక నవలలు,కథలు, వ్యాసాలు, ట్రావెలాగ్  వంటివి రాశాడని అన్నారు. ఆయన బౌద్ధం స్వీకరించి బౌద్ధం పై అనేక గ్రంథాలు రాశాడని అన్నారు. ఆయన నిజంగా భారతీయ మేధావుల్లో ఒకరని కొనియాడారు.        కడప సాహితీ స్రవంతి కన్వీనర్ బండి ప్రసాద్ మాట్లాడుతూ ...