srisri vardhanthi sabha
కష్టజీవికి కుడిఎడమల నడిచేవాడే కవి* సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బ్రౌన్ గ్రంధాలయంలో శ్రీ శ్రీ వర్ధంతి సభ జరిగింది ఈ సభకు అధ్యక్షులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ కదిలేది కదిలించేది మార్చేది మార్పించేది నవకవనానికి కావాలని శ్రీ శ్రీ కోరుకున్నాడని అన్నారు. అంతేగాక ఆయన కష్టజీవులకు ముందు నిలబడి "పదండి ముందుకు పదండి త్రోసుకు పదండి ముందుకు పదండి త్రోసుకు నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి కనబడలేదా మరో ప్రపంచపు ఎర్రబావుటా నిగనిగలు అగ్ని కిరీటపు ధగధగలు హోమజ్వాలపు బుగబుగలు అంటూ కష్టజీవులు వైపు నిలబడే వారందరినీ ఏకం కమ్మని పిలుపునిచ్చాడని అన్నారు. శ్రీశ్రీ కవిత్వం ఈనాటికి అజరామరంగానే ఉందని యువకులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. కొత్త తరం కవులకు దారి చూపుతోందని అన్నాడు. శ్రీ శ్రీ కవిత్వం సమకాలీనత అనే అంశం పైన యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత్వం కార్మికులకు మార్చింగ్ బ్యాండ్ లాగా పనిచేస్తుందని అన్నారు. ఆయన సాహిత్యాన్ని మొత్తంగా అధ్యయనం చేశాడన్నారు. నన్నయ తి...