2019
2019ఫిబ్రవరిలో నేను రాసి ప్రచురించిన 60 మట్టిపోగు పుస్తకాలను అనంతపురం కేంద్ర గ్రంథాలయం లో ఇచ్చా.
2019మార్చిలో కదిరి అభివృద్ధి వేదిక ను ఏర్పాటు చేశా.ఎన్నికల సందర్భంగా పోటీ అభ్యర్థులతో కదిరి అభివృద్ధి కోసం వారేం చేస్తారో చెప్పాలని కోరాం.
2019ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున అభివృద్ధి వేదికను ఏర్పాటు చేశాను
అంబేద్కర్ జయంతి సందర్భంగా కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ కుమార్ స్వామి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పైకి ఎదిగాడని దళితుల సమస్యల పైన పోరాడుతూ సమాజంలో ఉన్న కులవివక్షను పోగొట్టడానికి అసమానతలను పోగొట్టడానికి అనేక పోరాటాలు చేశాడ న్నారు .రాజ్యాంగ నిర్మాతగా లౌకిక ప్రజాతంత్ర ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఆయన అభిలషించారు. కదిరి అభివృద్ధి వేదిక ను అంబేద్కర్ జయంతి తేదీని ని ప్రారంభ దినంగా తీర్మానం చేశారు. ఈ సమావేశానికి వేదిక మరో కన్వీనర్ జెవిరమణ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ ,ఎన్జీవో నాయకులు ఆత్మ రెడ్డి , లాయర్ చౌడప్ప, రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి , విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు ఈశ్వర బాబు, పాల్,నబీరసూల్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం జరిగిన సమావేశంలో అభివృద్ధి వేదికను రిజిస్టర్ చేయించాలని, కమిటీలు వేయాలని ,మున్సిపల్ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని సభ్యులంతా తీర్మానించారు.
1.6.2019 న ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి సాహిత్య పురస్కార సభ
జూన్ లోఎద్దుల సిద్ధారెడ్డి స్మారకార్థం కథ, కవిత్వంలో పురస్కార పోటీలను నిర్వహించాను. జూన్ నెలలో వారికి కదిరిలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమం లో బహుమతులను మహాలక్ష్మి అక్క ద్వారా ఇచ్చాను.
2019
జూలై నెలలో కడపలో బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో ఎద్దుల సిద్ధారెడ్డి స్మారకోపన్యాసాలు రాయలసీమ సాహిత్యంపై నిర్వహించాను దీనికి సంబంధించిన ఖర్చులు కూడా మహాలక్ష్మి అక్క భరించింది.
2019
జూలై లో
జూలై నెలలో తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా లోని రాజమండ్రి దగ్గరున్న ధవలేశ్వరం ప్రాజెక్టును, పంచారామాలలో అమరావతి తప్ప అన్నింటినీ నా భార్యతో కలిసి చూశాను.
2019 ఆగష్టు లోఆర్ డి టి నిర్వహిస్తున్న వికలాంగుల పాఠశాల లో ఉన్న విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్ లు పంచాను. కదిరి లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కదిరి ని అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేమి అనే అంశం మీద ఉపన్యాస పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చాను.
అవయవ దానం పై సమావేశం జరిగింది.
కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ ఎన్ ఎల్ డిగ్రీ కళాశాలలను మానసిక వికాసం, శరీర అవయవ దానం పై సదస్సు జరిగింది.ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన అభివృద్ధి వేదిక కన్వీనర్ పిళ్లా కుమార స్వామి రెడ్డి మాట్లాడుతూ మానసిక వికాసంలో పాత ఛాందస భావాలను వదులుకొని సరికొత్త ఆధునిక భావాలను అలవర్చుకుంటారని అందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కళాశాల ఉపాధ్యక్షులు ఆదిలక్ష్మి హాజరయ్యారు . అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈశ్వర లింగం మాట్లాడుతూ నేత్ర దానం అవయవ దానం రక్తదానం మనిషి ఇవ్వగల దానాలని అలా ఇవ్వడం ద్వారా ప్రపంచాన్ని విడిచి పోకుండా ఇక్కడే ఉన్నట్లు ఉంటుందని, ఇది గొప్ప మానవత్వానికి సంబంధించిన చర్య అని చెప్పారు. తర్వాత నేత్రదాన ప్రాముఖ్యతను వివరిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన పి ఎస్ రాజు మాట్లాడుతూ ప్రజలు అనేక మూఢనమ్మకాలతో ఉన్నారని ఆ మూఢ నమ్మకాల నుంచి బయటపడి తోటి మానవులకు సహాయం చేయాల్సిన మానవీయ గుణాలను పెంపొందించుకోవాలని కోరారు. రక్త దానము కిడ్నీ దానం లివర్ దానము మనిషి తాను జీవించి ఉండగా ఇవ్వగల దానాలని ఆయన చెప్పారు . శరీరాన్ని మరణించిన తర్వాత ఆసుపత్రులకు ఇస్తే ఆ శరీరాన్ని పరీక్షించి విద్యార్థులకు అధ్యాపకులు బోధన చేస్తారని చెప్పారు . జీవితంలో, జీవితానంతరం మనం జీవించడానికి ,మనిషి మనిషిగా ఉండడానికి ఈ దానాలు చాలా ఉపకరిస్తాయని ఆయన చెప్పినారు .మానసిక వికాసం విద్యార్థులకు చాలా అవసరమని అది అనుభవం ద్వారా లేదా ఇతరులు చెప్పగావిని తెలుసుకొని జీవితంలో ఆచరించడం ద్వారా పురోభివృద్ధి సాధిస్తారని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లో వేదిక కన్వీనర్ రమణ , తెలుగు అధ్యాపకులు సుందర మోహన్ రెడ్డి ,,ఇటుక ఇలియాస్ , ఎస్ ఎన్ జే ఎల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ లు పాల్గొన్నారు.
గమనం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో పిళ్లా విజయ్ రాసిన లెనిన్ జీవిత కథనం పుస్తకావిష్కరణ సభ జరిగింది .ఈ సభకు సాహితీస్రవంతి జిల్లా కమిటీ సభ్యులు ప్రజ్ఞా సురేష్ అధ్యక్షత వహించారు. పుస్తకావిష్కరణ కర్తగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విచ్చేశారు. పుస్తక సమీక్షకులుగా విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు హాజరయ్యారు. సభాధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ పిళ్లా విజయ్ రచించిన లెనిన్ జీవిత కథనం క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉందన్నారు. లెనిన్ గురించి చాలా గ్రంథాలు ఉన్నప్పటికీ సులభశైలిలో లెనిన్ జీవితాన్ని యువతరం కు అందించడం కోసం ఆయన రచించడం సంతోషించదగ్గ విషయమన్నారు. లెనిన్ మానవతా మూర్తి, ప్రవహించే ఉత్తేజం అని ఆయన ఆధ్వర్యంలో రష్యాలో సాధించిన విప్లవం ప్రపంచంలో స్వాతంత్రం కోసం పోరాడుతున్న దేశాలన్నింటికీ స్ఫూర్తినిచ్చిందన్నారు .ఆయన మన దేశానికి కూడా అందించిన స్నేహ హస్తం మరవరానిదన్నారు. పుస్తకాన్ని విశ్లేషిస్తూ గోవిందరాజులు రష్యా పరిస్థితులకనుగుణంగా మార్క్సిజాన్ని లెనిన్ ఆచరణాత్మకంగా తీర్చిదిద్దాడన్నారు .ఆయన పార్టీని బలంగా నిర్మించి ప్రజా చైతన్యం కోసం అనేక పుస్తకాలు రచించాడన్నారు. ప్రతి వంటగత్తె రాజకీయవేత్త కావాలని కోరాడన్నారు. తీవ్రవాదం సరైన మార్గంకాదని లెనిన్ చెప్పాడన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడగలగడమే నేటి యువతకు లెనిన్ అందిస్తున్న జీవిత సందేశమ న్నారు. ఆవిష్కర్త రాంభూపాల్ మాట్లాడుతూ ఈరోజు భారత దేశంలో పెరుగుతున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటం ,ఆర్టికల్ 370 ని వ్యతిరేకించడం ఇవన్నీ లెనిన్ నేర్పిన పోరాటాలకు నిదర్శనమన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కూడా పోరాటాలు చేయాలనడం వెనుక కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ప్రభావం ఉండటమే కారణమన్నారు. తర్వాత సోషలిస్ట్ యూనిటీ సెంటర్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర మాట్లాడుతూ లెనిన్ కావ్యం మయకోవిస్కీరాస్తే దానిని శ్రీ శ్రీ అనువదించాడన్నారు .ఆ కావ్యంపై పిళ్లా విజయ్ సమీక్ష రాసి కొత్తతరం లెనిన్ ను చదవాలన్న ఆసక్తిని కలిగించాడన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ మార్క్స్
లేకుండా లెనిన్ లేడని లెనిన్ లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలు లేవని ఈరోజు కమ్యూనిస్టులు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూ డెమోక్రసీ నాయకులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ లెనిన్ సిద్ధాంతాలను సులభశైలిలో ఈ చిన్న పుస్తకంలో పిళ్లా విజయ్ పొందుపరిచాడన్నారు.
వీటిని అందరూ అధ్యయనం చేయాలని ఆయన కోరారు సమాజ మార్పు కు కమ్యూనిస్టు పార్టీల అవసరం ఉందని ఆయన కోరారు. అనంతరం రచయిత పిళ్లా విజయ్ స్పందిస్తూ లెనిన్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి దాన్ని ఆచరణలో చూపించాడ న్నారు .మన దేశంలో కూడా బుద్ధుడు తన సిద్ధాంతాన్ని చెప్పి దాన్ని తన్ను తాను మార్చుకోవడానికి ఆచరణ చేయాల్సిన అవసరాన్ని చెప్పాడన్నారు బుద్ధుడు పూర్తిగా భౌతికవాది. అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు అంబేద్కర్ వాదులు లు మార్క్సిజాన్ని ఆమోదిస్తూనే మనువాదభావాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని వారితో వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. లెనిన్ ప్రస్తుత సమాజానికి చాలా అవసరం ఉందని ముఖ్యంగా యువతరానికి ఆయన భోధనలను అందించడానికే తాను రాసినట్టుగా చెప్పినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ,కవి జెట్టి జయరాం సాహితీ ప్రస్థానం నిర్వాహకులు అశ్వర్థరెడ్డి ,సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రగతి , రచయిత్రులు నిర్మల రాణి, యమున, మిద్దె మురళీకృష్ణ, సూర్యనారాయణ రెడ్డి, ఒంటెద్దు రామలింగారెడ్డి , సామాజిక కార్యకర్త బోసు బాబు ,ప్రముఖ కవి ఏలూరిఎంగన్న,
డాక్టర్ వీరభద్రయ్య ,యువజన సంఘం నాయకులు బాలకృష్ణ , సిపిఎం పార్టీ నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
2019 సెప్టెంబర్ లోకదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కదిరి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై ప్రసంగ పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఉపన్యాసకులు అధ్యాపకులు సి.ఆదినారాయణ అధ్యక్ష వహించారు. న్యాయనిర్ణేతలుగా ఆదినారాయణ, చంద్రమోహన్ రెడ్డి ,పిళ్ళా కుమారస్వామి రెడ్డి వ్యవహరించారు.పోటీలో పాల్గొన్న విద్యార్థులు చక్కగా కదిరి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చెప్పారు. ప్రథమ బహుమతిని బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి సుధీర్ నాయక్ కు కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ పిల్ల కుమార స్వామి రెడ్డి అందజేశారు. ద్వితీయ బహుమతిని బి.ఏ.ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె. షహిన కదిరి అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు రాజేంద్ర చేతుల మీదుగా తీసుకున్నారు. తృతీయ బహుమతిని బికాం తృతీయ సంవత్సరం చదువుతున్న ఓ. గాయత్రి తెలుగు అధ్యాపకులుసుందర మోహన్ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు . పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రత్యేక బహుమతులను తెలుగు అధ్యాపకులు ఆదినారాయణ అందజేశారు.
కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ పిల్లా కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ కదిరి అభివృద్ధి కోసం ఏం చేయాలనే అంశాలను మనం పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని, అవి పరిష్కరించేటట్లు వారిపై ఒత్తిడి తేవాలని కదిరి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక ప్రముఖ స్థానాన్ని సాధించుకు నే టట్లు చేయాలని ఆయన కోరారు. అందుకు విద్యార్థులు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి ప్రసంగ పోటీలు లో విద్యార్థులు పాల్గొని భావవ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సుందరమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజేంద్ర మాట్లాడుతూ కదిరి ప్రాంతం లో విద్యార్థులకు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని అనేకసార్లు పోరాడినట్లుగా చెప్పారు .ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని మహిళలకు డిగ్రీ కళాశాలను ఇంజనీరింగ్ , మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాల్గొన్న విద్యార్థులు కదిరి ప్రాంతానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై వివరంగా విశ్లేషించారు.
2019నవంబరులోబాలుర పాఠశాలలో విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి వారికి ప్రతి తరగతికి ప్రథమ బహుమతి కింద వంద రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చాను.
2019నవంబరు3/4లో యsp ki letter
ఇటుకల పల్లి గ్రామం లోని సర్వే నంబరు 99 _1 , 99,99_E లో 140, 141, 142 ప్లాట్లు మొత్తం పది సెంట్లు స్థలాన్ని నా భార్య శ్రీమతి లక్ష్మీ దేవి పేరిట శ్రీమతి పంచాగ్నుల నీలవేణి భర్త P V S శర్మగారి దగ్గర20 .12. 2007న కొనుగోలు చేసినాను. మాతోపాటు శ్రీమతి గాయత్రి భర్త రమణారెడ్డి పది సెంట్లు , శ్రీమతి అనురాధ పది సెంట్లు శర్మ గారి దగ్గర కొనుగోలు చేశారు. మా ముగ్గురికి ఒకే చోటు న స్థలాన్ని చూపించారు. ఆరు నెలల క్రితం ఏప్రిల్ నెలలో మా స్థలానికి హద్దులు వేయించడానికి ముగ్గురము వెళ్ళినాము. అప్పటికే మా స్థలం కెదురుగా ఉన్న శ్రీమతి లీలా దేవి భర్త ఎం శ్రీనివాసులు మరియు శ్రీమతి అనసూయమ్మ భర్త జి వెంకట నాయుడు( ఎండిఓ ఉరవకొండ) ఇద్దరు కలిసి రోడ్డు తో సహా 20 అడుగులు ముందుకు సాగి మా స్థలాన్ని ఆక్రమించి కంచె వేసి ఉన్నారు. మా స్థలంలో 20 అడుగులు ఆక్రమించిన విషయాన్ని ఇటుకల పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాము. ఆనాటి జమేదార్ నాగన్న గారు ఆక్రమించిన వెంకట నాయుడు గారిని లీలావతి గారిని ఫోన్లో పిలిచారు .వారు రాలేదు తర్వాత బ్లూ కోట్స్ రవి మరియు ఇతర పోలీసుల సమక్షంలో వారు పాతిన బండలను కంచెను తొలగించి నాము. దానిని వీడియో కూడా తీసినాము. కానీ మరుసటి రోజు మా స్థలం పరిధి వరకు హోల్స్ మాట్లాడుకుంటుండగా ఉరవకొండ లో పనిచేస్తున్న వెంకట నాయుడు గారు అడ్డుపడి మమ్మల్ని దుర్భాషలాడుతూ కొట్టడానికి వచ్చాడు రౌడీ లాగా. మీరు మా స్థలాన్ని ఎలా ఆక్రమించారని అడిగితే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోమని మా పై దౌర్జన్యం చేసినారు .అప్పుడు మేము ఇటుకల పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము.వారు వెంకట నాయుడు గారిని రమ్మని పిలువగా దురుసుగా మాట్లాడుతూ రానని చెప్పినారు. నీ మీద కేసు పెడతామని చెప్పగా తర్వాత వచ్చినాడు. అప్పటి సిఐ మధుగారు సమస్యను పూర్తిగా విన్న తర్వాత ప్రభుత్వ సర్వేయర్ ద్వారా సర్వేకు అప్లై చేసి సర్వే కొలతల ప్రకారం ఎవరి స్థానంలో వారు హద్దులు వేసుకోమని చెప్పినారు. వారి సూచన మేరకు మేము 11 .6. 2019 న సర్వే కోసం ఐదు వందల నలభై ఐదు రూపాయలు మీ సేవలో కట్టి దరఖాస్తు చేసినాము. ప్రభుత్వ సర్వేయర్ వి ప్రతాప్ రెడ్డి గారు 24. 6 .2019 న జి. అనసూయమ్మ, టి బాలయ్య, లీలావతి, లక్ష్మీదేవి, గాయత్రీ, అనురాధ గార్లకు నోటీసులు పంపించారు. ఇలా నోటీసులు 7 .7 .19 నఒకసారి 28 .7. 19 న మరోసారి పంపినారు. కానీ స్థలాన్ని ఆక్రమించిన అనసూయమ్మభర్త వెంకట నాయుడు( ఎమ్ డి ఓ, ఉరవకొండ), లీలావతి గారు హాజరుకాలేదు. సర్వేయరు ప్రతాప్ రెడ్డి గారు వెంకట నాయుడు గారికి ఎన్నోసార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పినా నాకు టైం లేదు అంటూ కాలహరణం చేస్తూ వచ్చారు. మాకు మానసిక సంక్షోభాన్ని పెంచినాడు. చేసేదేమీలేక చేసిన సర్వే మేరకు మేము వారం క్రితం మా పరిధిలో పోల్స్ నాటి కంచె వేసినాము. కానీ ఇటీవల దారి ఇవ్వలేదని శ్రీమతి లీలావతి , శ్రీమతి అనసూయమ్మ గార్లు ఫిర్యాదు చేసినారని తెలిసింది. వాస్తవానికి మేము ఎవరి స్థలాన్ని ఆక్రమించలేదు. దారిని కూడా ఆక్రమించలేదు. మా స్థలాన్ని ఆక్రమించి మా పై దౌర్జన్యం చేసిన వారే అన్యాయంగా ఫిర్యాదు చేయడం న్యాయ సమ్మతం కాదని మనవి చేసుకుంటున్నాము ఇప్పటికైనా వారు సర్వేకు హాజరై పోలీసు అధికారుల సమక్షంలో ప్రభుత్వ సర్వేయరు ఇచ్చే సర్వే ఆధారంగా ఎవరి ఇ స్థలాన్ని వారు హద్దులు ఏర్పరుచుకునే విధంగా న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుచున్నాము.
2019డిసెంబరు
విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో డిసెంబర్ 27,28 తేదీలలో రెండు రోజులపాటు పాల్గొన్నాను .
2019 డిసెంబర్ లోవేమన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర, యస్ యఫ్ ఐ నాయకులు బాబ్ జాన్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా గౌరవా ధ్యక్షులు పిళ్లా కుమార స్వామి మాట్లాడుతూ విద్యార్థుల్లో మంచి సృజనాత్మక శక్తి ఉందని దానిని వెలికి తీయటానికి కథ కవిత్వ వ్యాసరచన మొదలైన సాహిత్య పోటీలు ఉపకరిస్తాయని చెప్పారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో నెలనెలా కథల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి చదువులో బాగా రాణిస్తారని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్ బాన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల సందర్భంగా భగత్ సింగ్ పై వ్యాస రచన పోటీలు కూడా నిర్వహిస్తామని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు . కార్యక్రమాన్ని సమన్వయ పరచిన కృష్ణ మూర్తి రాజు మాట్లాడుతూ పిళ్లా కుమార స్వామి సాహిత్యరంగంలో విశేష కృషి జరుపుతున్నారని, విద్యార్థి లోకాన్ని కూడా సాహిత్య రంగం లోకి తీసుకురావడం కోసం కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో లో తెలుగు ఉపాధ్యాయులు పవన్ ,రమణ ,హరి ప్రసాద్ రెడ్డి, జయంతి ,చలపతి ,లతీఫ్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. బహుమతులు పొందిన వారిలో ఫర్హాన్, సోహెల్, శ్రావణ్ కుమార్ , కేదార్నాథ్ ,ఈ ఎస్ కరిష్మా విద్యార్థులు ఉన్నారు
2020 జనవరిలో
గాలిపటాల ఎగురవేత పోటీ
సంక్రాంతి పండుగ సందర్భంగా 15వ తేదీ మధ్యాహ్నం 3 గం.లకు కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో 20 సంవత్సరాలు వయసు లోపున్న వారందరికీ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో గాలిపటాల ఎగురవేసే పోటీలు నిర్వహిస్తున్నట్లు కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ పిళ్లా
కుమారస్వామి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాలిపటం తోకపై మానవాళికి ఉత్తమ సందేశాన్ని రాసి అత్యధిక ఎత్తుకు గాలిపటాన్ని ఎగరవేసిన వారికి ప్రధమ బహుమతి , ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయన్నారు. గాలి పటాలను ఎవరికి వారే తెచ్చుకోవాలని కోరారు.
ఇతర వివరాలకు కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ పిళ్లా కుమారస్వామి రెడ్డి 9490122229 కి ఫోను చేసి సంప్రదించగలరు.
కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గాలిపటాలు ఎవరు వేసే ఈ పోటీని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 20 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిర్వహించింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేదిక కన్వీనర్ కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరారు గాలిపటాలు సంక్రాంతి సంబరాల్లో ఎగరడం చాలా కాలం నుంచి వస్తోందని అన్నారు ఈ గాలిపటాలు ఎగురవేయడం తో పాటు ఆ గాలిపటం పై చక్కని సందేశాన్ని కూడా రాయాలని పోటీల్లో నిబంధన ఉన్నందున పాల్గొన్న వారంతా మంచి సందేశాలు ఇచ్చారని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు గాలిపటాలు ఎగురవేయడం చైనాలో 2500 సంవత్సరాల క్రితమే ప్రారంభం అయింది అన్నారు పిల్లలందరూ మైదానాలలో గాలి పటాలను ఎగుర వేయ డం వల్ల వారికి చక్కగా విటమిన్-డి లభిస్తుందని ఇది ఎముకల దృఢత్వానికి మంచిదని అన్నారు.ఈ పోటీలకు బహుమతి ఇవ్వడానికి లాయర్ లోకేశ్వర్ రెడ్డి తన సోదరి జ్ఞాపకార్థం లింగాల సోమావతి మెమోరియల్ ట్రస్ట్ తరఫున బహుమతులు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు రమణ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుగుతుంటాయి ఇవి కాకుండా పతంగుల పోటీలు పెట్టి అందరిలో సమైక్యతను తీసుకు రావడం మంచి కార్యక్రమం అని చెప్పారు. వేదిక మరో కన్వీనర్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో కులమతాలకతీతంగా పతంగాల పోటీలో అందరూ పాల్గొనడం చాలా మంచి పరిణామమని అన్నారు. ప్లాస్టిక్ నివారిస్తూ భూమిని రక్షించాలని అనే సందేశాన్ని ఇస్తూ తన పతంగాన్ని ఆకాశంలోకి ఎంతో ఎత్తుకు ఎగరవేసి న షామీర్ కు ప్రథమ బహుమతి ని, వేణుకు ద్వితీయ బహుమతి ని,విమల్ నవదీప్ కు తృతీయ బహుమతిని , విజయ్ కి చతుర్ధ బహుమతిని అందజేశారు. పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ హనుమంత్ రెడ్డి, యోగా మాస్టర్ గోండ్రాల నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment