Posts

Showing posts from March, 2022

కవితల తోట

నీ నడుము వంపు లో నా మనసు కరిగి ప్రవహిస్తోంది నీ అమృతకలశంలోకి నీ తీయని స్వరం తీగలుగా సాగి సాగి నా పిల్లన గ్రోవిలో సరిగమలు పలికిస్తున్నవి రాత్రంతా నాభావాలు అక్షరాల నదిలో ఈదిఈది ఉదయానికల్లా కవితలుగా మారి వాట్సాపు వొడిలో సేద తీరుతున్నాయి. నీలోని స్నేహ పరిమళం అందరి మనసులను సుతారంగా తాకుతుంది. తప్పులు వెతికే వారు నీ వెనకాల గొణిగేవాళ్ళు చరిత్ర లో అనామకులౌతారు. కమ్మటి కలలకు నీరాజనం నీరూపం... ఆస్వాదించే హృదయానికది చంద్రోదయం నీ చక్కని చిక్కని నల్లని రింగు లు తిరిగిన కురులు పై వాలిన మల్లెపూలు నను రా రమ్మని పిలుచు చున్నవి అధర చుంబనం చేయమని నీ మాటల మంత్రాలతో  ఏదో మాయచేసి నా మనసును దోచేశావు నీ చూపుల తూపులతో గాలం వేసి మనసంతా నువ్వయ్యావు నా గుండె చప్పుడు  సముద్రపు పొంగు లో అందమైన నురుగు నీ హంపిసొంపుల పొంగులో ఎగిసిపడుతోంది సోయగాల పరుగు నేలకే నాట్యం నేర్పావే గాలికే సంకెళ్లు వేశావే ముద్దమందారమా నీతో పరిచయం నన్నిలా చేసిందే ప్రియతమా కనులు మూసినవేళ కలలో నీవే కనులు తెరచినవేళ కనిపించేదీ నీవే మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే ఇందాక  సన్నజాజిలా నడుము నా...

రాత్రి కల 27.3.2022

రాత్రి నాకో కల వచ్చింది. అందులో అనుష్క గర్భం ను బలవంతంగా వత్తూతూ గద్దర్ ఆమె గర్భం విచ్ఛిత్తి చేస్తున్నాడు.ఇలా ఎందుకు వచ్చింది?

నాకో కల వచ్చింది

నాకో కల వచ్చింది రాత్రి.తమిళ నాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ గారు నాకు ఒక యూనివర్సిటీ కి వీసీగా చేసినట్లు ఆ పదవిని అందుకుని ఆ యూనివర్సిటీని అన్ని రంగాల్లో చక్కదిద్దినట్లు పేరు ప్రతిష్ఠలు పొందినట్లు నాకు ఒక కల వచ్చింది. అందులో అన్ని కాలేజీల్లో మరుగుదొడ్లను బాగు చేయించినట్లు, లైబ్రరీ బాగు చేయించి డిజిటల్ గా మార్చినట్లు,   రిక్రూట్మెంట్ జరిపి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కొద్దిపాటి రెకమండేషన్ ఆమోదించి నియామకం జరిపినట్లు కల వచ్చింది. ఎస్సీ ఎస్టీ రోస్టర్ తయారుచేసి వారందరికీ సముచితంగా వారి వాటా ప్రకారం వారికి ఉద్యోగాలు వచ్చేటట్లు ప్రమోషన్లు వచ్చేటట్టు చేసినట్లు కల వచ్చింది.క్రమశిక్షణా రాహిత్యం ఉన్న ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించి వారికి తగిన చర్యలు చేపట్టినట్లు కల వచ్చింది. ఈ కల నాకు కొత్తగా ఉంది. భిన్నంగా ఉంది. ఏ మాత్రం ఊహించనిది.  26 రాత్రి శనివారం నాడు తెల్లారితే ఆదివారం ఈ కల వచ్చింది.(2022)