Posts

Kcdf round table 7.2.26

Image
కడప నగరంలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలి          ___ KCDF రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల డిమాండ్          కడప నగరాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఆ వేదిక కన్వీనర్ పీ.వి. కుమారస్వామి రెడ్డి  అధ్యక్షతన జరిగింది.‌ ఆయన మాట్లాడుతూ కడప అభివృద్ధి వేదికకు కుమార స్వామి రెడ్డి కన్వీనర్ గా రామకృష్ణారెడ్డి కోకన్వీనర్ గా ఏర్పడిందన్నారు. కడప నగరంలో ఉన్న వివిధ సమస్యల పైన నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాల పైన చర్చించడానికి నగరంలో ఉన్న మేధావులు డాక్టర్లు ఇంజనీర్లు స్వచ్ఛంద సంస్థలు ఇతర సామాజిక సేవా భావం కలిగిన వారందరినీ ఆహ్వానించామన్నారు. కడప నగరం ఏర్పడి 20 ఏళ్లకు పైగా అయినా ఇంతవరకు మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని అన్నారు అభివృద్ధి అసలు ఊసే లేదని అన్నారు. నగరం చాలా విస్తరించినా పార్కులు రెండు మాత్రమే ఉన్నాయని, ఇంకా చాలా పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మంచినీరు అరకొరగా వస్తుందని స్వచ్చమైన నీరు అన్ని ప్రాంతాల వారికి అందించాలని అన్నారు. ఇంకా ఇతర అంశాల పైన చర్చించడానికి వివిధ రంగ...

Articles

Image
 అజంతా గుహలు మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లాలో జల్పగావ్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 59 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ఔరంగాబాద్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో, ఎల్లోరా నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.వీటిని క్రీ.పూ. 2 వ శతాబ్దం నుండి క్రీ.పూ 480 వరకు నాటి 30 రాతి గుహలుగా చెక్కబడిన బౌద్ధ స్మారక చిహ్నాలు .ఇవి గుబురుగా పైకి ఎగసిన వృక్షాల నడుమ గుర్రపు నాడా ఆకారంలో 250 అడుగుల ఎత్తుతో ఉన్న లోతైన లోయ పక్కన ఈ గుహలు ఉన్నాయి. దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు పశ్చిమ కనుమల మధ్య అడవిలో వెన్నెలగా ఉండిపోయిన ఈ గుహలను 1819లో యాదృచ్ఛికంగా పునరావిష్కృతమైనాయి.         ఈ గుహల్లోని మందిరాల్లోని శిల్పకళ , చిత్రకళ, వాస్తుశిల్పం ఈ మూడు అజంతాను ప్రపంచ ప్రఖ్యాతి పొందేలా చేశాయి.       బుద్ధుని జీవితంలోని ఘట్టాలు, జాతక కథలు అత్యంత సున్నితంగా శ్రద్ధతో చిత్రీకరించారు ఆనాటి చిత్రకారులు. మానవ జీవితంలోని నీతి, ధర్మ విలువలు అందులో వ్యక్తమవుతాయి.చిత్రాల్లోని ముఖాలలో ప్రేమ, కరుణ, విషాదం, శాంతి వంటి భావాలు స్పష్టంగా కనిపిస్తాయి.       ఈ గుహలను సందర్శించి...
Compromise with the environment  Have the patience   godava vaddu Chuttipakkala vallatho సఖ్యతగా undaali
Image
Image
మానసిక వికాసం, అవయవ దానం పై సదస్సు August 28, 2019, 1:14 PM అవయవ దానం మహోన్నతమైనది కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ ఎన్ ఎల్ డిగ్రీ కళాశాలలను మానసిక వికాసం, శరీర అవయవ దానం పై సదస్సు జరిగింది.ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన అభివృద్ధి వేదిక కన్వీనర్ పిళ్లా కుమార స్వామి రెడ్డి మాట్లాడుతూ మానసిక వికాసంలో పాత ఛాందస భావాలను వదులుకొని సరికొత్త ఆధునిక భావాలను అలవర్చుకుంటారని అందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కళాశాల ఉపాధ్యక్షులు ఆదిలక్ష్మి హాజరయ్యారు . అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈశ్వర లింగం మాట్లాడుతూ నేత్ర దానం అవయవ దానం రక్తదానం మనిషి ఇవ్వగల దానాలని అలా ఇవ్వడం ద్వారా ప్రపంచాన్ని విడిచి పోకుండా ఇక్కడే ఉన్నట్లు ఉంటుందని, ఇది గొప్ప మానవత్వానికి సంబంధించిన చర్య అని చెప్పారు. తర్వాత నేత్రదాన ప్రాముఖ్యతను వివరిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన పి ఎస్ రాజు మాట్లాడుతూ ప్రజలు అనేక మూఢనమ్మకాలతో ఉన్నారని ఆ మూఢ నమ్మకాల నుంచి బయటపడి తోటి మానవులకు సహాయం చేయాల్సిన మానవీయ గుణాలను పెంపొందించుకోవాలని కోరారు. రక్త దాన...