2017లో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల దృశ్యమాలిక
ఫిబ్రవరి లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో
అనంత సాహితీ సమాలోచన పుస్తకాన్ని ప్రచురించాము.
ఏప్రిల్‌లో 30న వివిధ సాహిత్య సంఘాల తో కలిసి వేమన సాహిత్యం పై రాష్ట్ర సదస్సు ను నిర్వహించాము.ప్రజానాట్యమండలి వేమన రూపకాన్ని ప్రదర్సించింది.పార్టీ సహకారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరిగేది కాదు.దీని కోసం 5 లక్షలు సేకరిస్తే దాదాపు 3.60 వరకు ఖర్చు అయింది.
వేమన సాహిత్యాన్ని ప్రజల్లోకి
సమాజ హితాన్ని కోరి సాహిత్యాన్ని రచించిన ప్రజా కవి వేమన సాహిత్యాన్ని ప్రజల్లో కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా వుందని వేమన ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఆదివారం నాడు లలితకళాపరిషత్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన వేమన సాహితీసమాలోచన రాష్ట్ర సదస్సు చారిత్రాత్మక సాహిత్య సదస్సుగా నిలిచిందన్నారు. దాదాపు రెండు వందల యాభై సంఘాలు,ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు, సామాజిక వేత్తల ప్రత్యేక్ష, పరోక్ష సహాయ సహకారాలతో వేమన సదస్సు విజయవంతం అయ్యిందన్నారు. వేమన రూపకాలు జిల్లా చరిత్రతో గొప్ప ముద్ర వేసుకున్నాయన్నారు. ఇదే స్పూర్తితోవేమన సాహిత్యాన్ని ప్రజల్లోకి ముఖ్యంగా విద్యార్థులకు చేరవేసే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. ప్రముఖ జనప్రియ కవి వేలూరి యంగన్న అధ్యక్షతన వేమన సాహిత్య పీఠం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థి, ప్రజాసంఘాలసహకారంతో విస్తృతంగా వేమన సాహిత్యాన్ని సమాజానికి అందచేస్తామని తెలిపారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు
పిళ్లా కుమారస్వామి మాట్లాడుతూ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో వేమన సాహితీ సమాలోచన కార్యక్రమంలో ఆవిష్కరించినపుస్తకాలపై సమాలోచన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వేమన సాహిత్యం పై పోటీలునిర్వహించటంతో పాటు విద్యార్థులలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. ప్రజాకవి ఏలూరి యంగన్న మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనం రూపుమాపాలని వేమన ఆనాడే కోరాడన్నారు.సమాజ హితవు కోరుతూ ఆయన పద్యాలు సమాజంలో చొచ్చుకు పోయాయన్నారు. ఆయన సూర్తి నేటికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సాహితీ స్రవంతి నగరాధ్యక్షులు యాడికి సూర్యనారాయణరెడ్డి, అధ్యక్షులు డాక్టర్ మడూరు ప్రగతి, ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, నగర కార్యదర్శి అశ్వరరెడ్డి,కోశాధికారి కృష్ణవేణి, నానీల నాగేంద్ర, రియాజుద్ధీన్, సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్ర, ఐద్వా జిల్లాఅధ్యక్షులు లక్ష్మిదేవి, డివైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్,రాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వేమన సాహిత్య సదస్సును జయప్రదం చేసిన మిత్రులందరికి ధన్యవాదాలు
2017,ఏప్రిల్ 30 న రాజా,రమణ, రమేష్ ఫంక్షన్ (పద్మావతి) హాలులో వేమన సాహిత్య సమాలోచనరాష్ట్ర సదస్సు విజయవంతంగా జరిగింది. ఈ సదస్సును జయప్రదం చేయడానికి 250 సాహిత్య సంఘాలు,సాహిత్యకారులు, కవులు, రచయితలు, మేధావులు, ప్రజాసంఘాలు, సాహితీ స్రవంతి కార్యకర్తలు విశేష కృషి చేశారని వారందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని వేమన సాహిత్య సమాలోచన ఆహ్వాన సంఘం
అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వొరప్రసాద్, ప్రధానకార్యదర్శి పిళ్లాకుమారస్వామి రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతు వేమన రాష్ట్ర స్థాయి సదస్సుకు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది సాహిత్య కారులు హాజరయ్యా రన్నారు. ఈ సదస్సు నిర్వహణ కోసం ఎంతో మంది ప్రముఖులు ఆర్థిక సహాయాన్ని అందించారు. వీరందరికి వేమన సాహిత్య సమాలోచన ఆహ్వాన సంఘం ధన్య వాదాలు తెలియజేస్తున్నదన్నారు. ఈ సదస్సు విశేషాలను సదస్సుకు ముందు సదస్సు తరువాత ప్రజలకు చేరవేయటంలో పఠన దృశ్యమాధ్యమాలు కీలక పాత్ర పోషించాయని ఆయా యాజమాన్యాలకు ప్రత్యేకంగా ధనర్యవాదములు తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరై సదస్సును విజయవంతం
చేయడంలో సహకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ పల్లెరఘునాథరెడ్డి, అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఆర్డీటి ఎకాలజి సెంటర్ ఛైర్మన్ మల్లారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ, మెయిల్ సంస్థలకుప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సదస్సు విజయవంతం కావటంలో ప్రజానాట్యమండలి కళాకారులు వేమన రూపకం మరువలేనిదన్నారు. వేమన సాహిత్యంపై చర్చిండానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్తలకు ఆహ్వాన సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఇలాంటి ప్రజాచైతన్య సాహిత్య సదస్సులకు భవిష్యత్తులో ఇదే విధంగా సహకారం అందించాలని ఆహ్వానసంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, నగర గౌరవాధ్యక్షులు యాడికి సూర్యనారాయణరెడ్డి, అధ్యక్షులు నగరూరు రసూల్, కోశాధికారి కృష్ణవేణి, డా.ఎ.నాగేంద్ర, యమున, నరేష్త తదితరులు పాల్గొన్నారు.
నవంబరులో దాని కొనసాగింపుగా 13 పుపుస్తకాల పై సమీక్ష సదస్సుసదస్సు నిర్వహించాము. రాచపాలెం గారి సహకారం మరువలేనిది.రాష్త్ర కేంద్రానికి 40 వేల మొత్తం పంపినాము.
తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సంతకం సినారె
మానవత ను పూజించే మంచి మనసుకు
ఒకే మతం పైన గురి ఉంటుందా? అంటూ మానవతా గజల్లను రాసి వాటిని ప్రపంచ పదులు గా ఆలపించి ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలచి పోయినసినారె మరణం సాహిత్య లోకానికి ఎనలేని లోటని సాహితీ స్రవంతి గౌరవాద్యక్షులుపిళ్లా కుమారస్వామి (పిళ్లా విజయ్) ఒక ప్రకటనలో తెలిపారు.
మానవ పరిణామాన్ని కవితాత్మకం చేసి 'విశ్వంభర' కావ్యంగా మలచి తెలుగు సాహిత్యానికి అందించారు.ఆ కావ్యానికి జ్ఞాన పీఠ్ అవార్డు కూడా రావడం తో తెలుగు భాషను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి తెలుగు భాషకు వన్నె తెచ్చారు సినారె. ఆయన రాసిన సినిమా పాటలతో ఆయన మరచిపోలేని ఒక తీయని రాగం గాని అందరి హృదయాల్లో నిలిచిపోయారు.ఆయన రాసిన సిద్ధాంత గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వం'
నూతన తరం సాహిత్యకారులు అందరికీ కరదీపిక గా పనిచేస్తుంది.ఆయన రాసిన కవిత్వం కొత్త కవుల్ని నిరంతర ఉత్తేజపరుస్తూ ఉంటుంది.ఆయన మరణం అభ్యుదయ వాదులందరికీ తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది.ఆయన విడిచివెళ్లిన సాహితీ వారి వారసత్వాన్ని కొత్త తరం రచయితలు అందుకోవాలని సాహితీస్రవంతి భావిస్తోంది.
12.6.2017 పిళ్లా కుమారస్వామి
కదిరి
2/7/2017
మానవుని పెంచే రచనలు రచయితలు చేయాలి
జూలై లో కార్యకర్తలకు ఒక కార్య శాల నిర్వహించి నూతన జిల్లా కమిటీ ని నగర కమిటీ ని ఎన్నుకున్నారు.ఆసందర్భంలో జరిగిన సభ.
ఒకవైపు సాంకేతికత పెరిగి సమాజం ఎంతో అభివృద్ధి చెందిందని భావిస్తున్నప్పటికీ సమాజంలో ఇప్పటికీ ఎంతోమంది ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారన్నారు. మానవ సంబంధాలు తగ్గిపోయి మానసికంగా ప్రజలు పతనమవుతున్నారని దీన్ని గుర్తించి మానవత్వాన్ని పెంపొందించే రచనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సాహిత్యకారులకు నిర్వహించిన సాహిత్య కార్యశాల లో అనంతపురం
లోని భవనంలో 27 2017 న జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ విచ్చేశారు.
సాహిత్యంపై సాహిత్యంలో మౌలిక భావనలు అనే అంశంపై చర్చించిన పిళ్లా కుమారస్వామి మాట్లాడుతూ తూ సమాజం మారుతున్న సందర్భంలో సాహిత్యం కూడా మారుతూ ఉంటుందని వర్తమాన ప్రపంచంలో ప్రపంచీకరణపై సాహిత్యం రావాల్సి ఉందని ఆ దిశగా రచయితలు రచనలు చేయాలని ఆయన కోరారు రచనలు రావాలని కోరారు.
తర్వాత కథ సాహిత్య పరిణామం క్రమం పై రాచపాళెం మాట్లాడుతూ సాహిత్యానికి పుట్టుక గమ్యం సమాజమే అన్నారు సమాజాన్ని వదిలిపెట్టి రాసే రచనలకు గుర్తింపు లేదన్నారు ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయని చెప్పారు ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర అధ్యక్షులు ప్రగతి సూర్యనారాయణ రెడ్డి సురేష్ మధుర శ్రీ రసూల్ శారద సత్యం నిర్దారమణ్ అశ్వర్థ నారాయణ నాగేంద్ర మిద్దె మురళీకృష్ణ బాలభారతమ్మ తదితరులు పాల్గొన్నారు
జులైలో రాయలసీమ సాహిత్యం పై ఒక పుస్తకాన్ని ప్రచురించాము. శ్రీ శ్రీ వర్ధంతి జాషువా వర్ధంతి జరిపాము.హిందూపురం లో సాహిత్య అకాడమీ తో కలిసి కథానికలో చేతివృత్తులు పై సదస్సు నిర్వహించాము.
SAHITHI SRAVANTHI
KADAPA DISTRICT COMMITTEE
Date: :22.9.2017
పత్రికా ప్రచురణార్థం
ఆధునికత కాలానికి సంబంధించింది కాదు - కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమ అన్ని సాహితీ ప్రక్రియలకు పుట్టిల్లు - మూల మల్లికార్జునరెడ్డి
సాహితీకారుల మధ్య ఐక్యత నేటి అవసరం - పిల్లా కుమారస్వామి
సిపి బ్రౌన్ లైబ్రరీలో పుస్తకావిష్కరణ
ఆధునికత కాలానికి సంబంధించిన అంశం కాదని, అది భావాలకి, సామాజిక చలనాలకి
సంబంధించిన అంశమని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు.
వర్ధమాన అభ్యుదయ రచయిత పిల్లా కుమారస్వామి రచించిన 'ఆధునిక సాహిత్య పరిణామ క్రమం,
రాయలసీమ ఆధునిక సాహిత్య పరిణామ క్రమం' పుస్తకావిష్కణ సభలో పుస్తక సమీక్ష చేస్తూ
ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ గురజాడ సాహిత్యంతో తెలుగు భాషలో సాహితీ పునరుజ్జీవనప్రక్రియ ప్రారంభమైందని అన్నారు.
అయితే ఆ తర్వాత ప్రాచీన సాహిత్య ధోరణుల ప్రాబల్యం కారణంగాఅదేస్థాయిలో ఆధునిక సాహిత్య అభివృద్ధి జరగలేదని, ఆది తెలుగు సమాజానికి నష్టం చేసిందనిఅన్నారు. పుస్తక ఆవిష్కర్త, వైవియు లలిత కళల విభాగం ఆచార్యులు డాక్టర్ మూలమల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో మొట్టమొదటి ప్రబంధం వచ్చిందని అన్నారు. చారిత్రక కావ్యాలు,గొప్ప విమర్శనా గ్రంథాలు రాయలసీమ నుంచే వచ్చాయని అన్నారు. నవలల్లో కూడా రాయలసీమవెనుకబడిలేదని ఆయన విశ్లేషించారు. పుస్తక రచయిత, వర్ధమాన అభ్యుదయ రచయిత పిళ్లా కుమారస్వామి మాట్లాడుతూ దళితుల్ని, స్త్రీలను, పిల్లలను సమదృష్టితో చూసే సాహిత్యమే ఆధునిక సాహిత్యమని అన్నారు. గురజాడ సాహిత్యం తెలుగు నేలపై అత్యంత ప్రభావశీలంగా పనిచేసిందని అన్నారు. ఒక కథ తెలుగునాట సారా ఉద్యమానికి, ప్రభుత్వాల మార్పునకు దారి తీసిందని అన్నారు.
సాహిత్యంలో వచ్చిన వివిధ ధోరణుల కారణంగా, ప్రపంచీకరణ ప్రభావాల వల్ల సాహితీ కారుల్లో అనైక్యత ఏర్పడటం బాధాకరమని అన్నారు. ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్య సృజనలో సాహిత్యకారులు ఐక్యంగా పనిచేయడంలోనే సమాజ ప్రగతికి వారు చోదక శక్తులుగా నిలుస్తారని అన్నారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. రఘునాథరెడ్డి
అధ్యక్షత వహించగా, జిల్లా కమిటీ సభ్యులు వైఎల్ నరసింహ స్వాగతం పలికారు. కార్యక్రమంలో
వివిధ రంగాలకు చెందిన సాహితీ అభిమానులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎ.రఘునాథరెడ్డి
వేమన రాష్ట్రస్థాయి సదస్సు కొనసాగింపుగా ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన 13 వేమన పుస్తకాలపై సాహితీ స్రవంతి రాయలసీమ స్థాయి సదస్సు అనంతపురం లోని ఎన్జీఓ హోంలో 26.11.2017న నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగమనేని నారాయణ వచ్చారు. వేమన మార్గం ఇప్పటికే అనుసరణీయమని అన్నారు. కేంద్రంలో మొత్తం పరిపాలిస్తోందని రాష్ట్రంలో కులం పాలిస్తోందని, ఈ రెండింటినీ ఖండించిన వేమన మార్గం అందరికీ మార్గదర్శనీయమని ఆయన అన్నారు.ఆత్మీయ అతిథిగా వచ్చిన డా. గేయానంద్
నేడు దేశంలో నెలకొన్న పరిస్థితులు భావ స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయన్నారు. వేమన తన కాలంలోనే ఆధునిక భావాలను పంచారని నేడు ఆయనే ఉంటే ఈ పాలకులు భయపడేవారని అన్నారు. వేమన అందించిన ప్రగతిశీల భావాలు నేడు అందరికీ అందాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో 13
పుస్తకాలపై వక్తలు ప్రసంగించారు.
Comments
Post a Comment