అప్పొ దీపో భవ కవిత


అప్పొ దీపో భవ

జగత్తే ఒక శంకతో మొదలైంది.
"ఎవరు? ఏమిటి? ఎందుకు?" అన్న సందేహంతో
బుద్ధుడు సాగించాడు జ్ఞాన మార్గాన్ని.
మరణ భయాన్నీ, పునర్జన్మ భ్రమనూ ఎదుర్కొన్నాడు,
తప్పుదారుల్ని తిరస్కరించి,
మధ్యమార్గపు వెలుగులో నడిచాడు.
వేదాల చెర నుంచి, ఆచారాల గూడు నుంచి
బయటికి రమ్మన్నాడు
సత్యం కోసం తిరగబడ్డాడు.
జ్ఞానం వెలుగులో నడవమన్నాడు 
జ్ఞాన దీపమై దారి దీపం కావాలన్నాడు 

"దుఃఖం ఎందుకు?" అని అడిగాడు,
"దుఃఖానికి కారణం ఏమిటి?" అని వెతికాడు,
పరిశీలన పంథాలో పటిచ్చ సముప్పాదం కనుగొన్నాడు.
తానొక్కడే ధ్యానంతోనే నిర్వాణం కనిపెట్టాడు,
ఏ దేవతల్ని కూడా అంధ విశ్వాసంతో పూజించలేదు
 "సత్యమే దారిదీపం," అన్నాడు
చర్చించి, పరిశీలించి, అనుభవించి స్వయంగా తెలుసుకున్నాడు.


తపోబలానికీ, వేదాంతానికి, మూడాచారాలకూ
తలవంచని తత్వవేత్తగా నిలిచాడు,
ఏది కరుణో, ఏది జ్ఞానమో
ఎరుక గలిగి మసలమన్నాడు.
జ్ఞానమనే నిప్పును కాల్చి 
సత్యమనే కణికగా మారాడు బుద్ద

ప్రజ్ఞా కుసుమాలను లోకమంతా పరిచాడు 
పరిశీలనా ధర్మాన్ని మానవాళి ముందుంచాడు,
మార్గదర్శకునిగా జాతిని జాగృతం చేశాడు.
బుద్ధుని బాటలో నడువు
జ్ఞాన దీపమై వెలుగు

____ పిళ్లా కుమారస్వామి,9059054756




Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022