పెండ్లి మర్రి మండలం గొందిపల్లె గ్రామం ఖాతా నెంబర్ 259 సర్వే నంబర్ 108 109 116 117118 119 123 సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ సమస్యలు


కడప,
                                                        10.2.2025.
జిల్లా కలెక్టర్,
కడప
వైయస్సార్ జిల్లా 

సార్ 

విషయం పెండ్లి మర్రి మండలం గొందిపల్లె గ్రామం ఖాతా నెంబర్ 259 సర్వే నంబర్ 108 109 116 117118 119 123 సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ సమస్యలు 

గంగవరం గంగమ్మ వైఫ్ ఆఫ్ లేట్ జి వెంకట్ రెడ్డి అయిన నేను మీకు విన్నవించుకోవడం ఏమనగా పై సర్వే నంబర్లకు సంబంధించి వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను దయచేసి ఈ క్రింద కనపర్చిన సమస్యలను నా మీద దయ ఉంచి పరిష్కరించవలసినదిగా వేడుకుంటున్నాను. 

వివరాలు 
1. పెళ్లి మరి మండలం గొందిపల్లె గ్రామం ఖాతా నెంబర్ 259 సర్వే నంబర్ 108 109 116 117 118 119123 124 భూములను మా ముత్తాత గారైన గంగవరం వెంకట్ నారాయణరెడ్డి దస్తావేజు 791/1927 ద్వారా కొనుగోలు చేసినాడు. దానికి సంబంధించిన దస్తావేజు కాపీని జతపరిచినాను. అతని ద్వారా మాకు సంక్రమించిన భూమిని సాగు చేసుకుంటున్నాము కానీ గత ప్రభుత్వ హయాంలో మాకిచ్చిన భూహక్కుపత్రంలో119,117మినహా ఇతర సర్వే నంబర్లను కనబరచలేదు. గత పాస్బుక్ లో ఇవన్నీ ఉన్నాయి దానిని కూడా మీకు జతపరిచినాను కావున అన్ని సర్వే నంబర్లను కలిపి కొత్త పాసుబుక్కులో ఇప్పించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను.

2. గత ప్రభుత్వ హయాంలో మీరిచ్చిన భూహక్కు పత్రం ఖాతా నంబర్ 259 LP no: 971,LP no: 1032 లో నా ఫోటో బదులు వేరొకరి ఫోటోలు పెట్టినారు. దానిని తొలగించి కొత్తగా ఇచ్చే పాస్ బుక్ లో నా ఫోటోను కనబరచవలసిందిగా కోరుతున్నాను ఎన్నికలకు పూర్వము ఈ విషయాన్ని వీఆర్వో గారిని కోరినప్పుడు మళ్లీ సరిదిద్దున కాపీ ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు అందువలన పైన కోరినట్లుగా అన్ని సర్వే నంబర్లను కలిపి ఇచ్చే పాస్ బుక్ లో నా ఫోటోను కనబరిచి ఇవ్వవలసిందిగా ప్రార్థించుచున్నాను. 

3. ఖాతా నెంబర్ 269 సర్వేనెంబర్ 108 109 116 118 123లకు సంబంధించిన భూములను చుక్కల భూముల నుంచి తొలగించినట్లు గత ప్రభుత్వంలో ఒక లెటర్ ఇచ్చినారు. కానీ వాటిని మాకు ఇచ్చిన పాస్ బుక్ లో పొందుపరచలేదు. అంతేగాక వాటిని మా ముత్తాత గంగవరం వెంకటనారాయణ రెడ్డి గారు దస్తావేజు నంబర్ 791/1927 ద్వారా కొనుగోలు చేసినందున వాటిని కొనుగోలు ద్వారా సంక్రమించినట్లు పాస్బుక్ లో పొందుపరచాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి డాక్యుమెంట్లు జతపరిచినాను. 

4. ఖాతా నంబరు 259 సర్వే నంబరు 116 118 డి పట్టాల కింద ఉన్నట్లు వీఆర్వో చెబుతున్నారు వాస్తవానికి పైన తెలిపినట్లు వాటిని మా ముత్తాత గంగవరం వెంకటనారాయణరెడ్డి గారు దస్తావేజు నంబర్ 791/1927 ద్వారా కొనుగోలు చేసినారు అందువలన వాటిని దాదాపు 100 సంవత్సరాలు నుండి వంశపారపర్యంగా మేము సాగు చేసుకుంటున్నాము అందువలన మీరు మాపై దయవుంచి డి పట్టా బదులు కొనుగోలు ద్వారా సంక్రమించినట్లు పొందుపరచవలనని కోరుతున్నాను 

5. పైన కనబరిచిన సర్వే నంబర్ 108 109 116 117118119 123 లను అన్నిటినీ కలిపి ఒకే పాస్ బుక్ లో గతంలో ఇచ్చినట్లు ఇవ్వాలని కోరుతున్నాను. 

6. పైన తెలిపిన సర్వే నంబర్లు కోసం కొత్త పాసుబుక్కు కోసం రెవెన్యూ సదస్సులో ఎంఓ ఎంఆర్ఓ గారిని కలిసి సంప్రదిస్తే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. కానీ సచివాలయం ఆన్లైన్ వెబ్ సైట్ లో this is under reserve village అని వస్తోంది. అందువలన అప్లై చేయడానికి వీలు పడడం లేదు. కావున సంబంధిత అధికారుల ద్వారా నాకు కొత్త పాసుబుక్కును ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. 

ఇట్లు
మీ భవదీయురాలు


గంగవరం గంగమ్మ వైఫ్ ఆఫ్ లేట్ గంగవరం వెంకట్రెడ్డి 20 / 180, ఆకుల వీధి కడప 
944 1215149/-9490122229

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు