kavitha



పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసిన జీవితం,
ఎడారిలో నిలుచున్న ఒంటరి ఒంటెలా ఉంది 
అనుభవాల గ్రంథమది
కాలం నేర్పిన పాఠాలను తెలివిగా చెబుతుంది.
తరాల తలపుల పేటిక తెరిచి 
గుప్త నిధులనందిస్తుంది 
వారితో గడిపే ప్రతి క్షణం 
మనకిస్తుంది ఎంతో జ్ఞానం.
మనకది చీకట్లో చిరు దీపం.
ముత్యమల్లే మెరిసే మణిదీపం
వృద్ధాప్యం కారాదొక శాపం
మనకది ఏనాడూ కాదొక భారం
ఆదరించాలి ఆ జ్ఞాన కుసుమాలను
అదే మానవత్వం.
అదే లేని నాడు 
నల్సా నిలుస్తుంది వారికండగా.

Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం