ఉప కులపతి బ్రౌన్ గ్రంథాలయ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి



యో.వే.విశ్వ విద్యాలయం ఉప కులపతి బ్రౌన్ గ్రంథాలయ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి , సాహితీ స్రవంతి కడప జిల్లా కన్వీనర్ బండి ప్రసాద్ సంయుక్తంగా ఒక ప్రకటనలో కోరారు. బ్రౌన్ గ్రంధాలయ సలహా మండలిని పునరుద్ధరించాలి. బ్రౌన్ గ్రంధాలయ ఆవరణలోని గోడ పై నున్న బ్రౌన్ చిత్రం వద్ద తెలుగులో " ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్"గా పూర్తి పేరు వ్రాయించాలి. బయట మెట్ల వద్ద రాంప్ ను సరిగాఏర్పాటు చేయించాలి ;కడప లోక్ అదాలత్ జడ్జిగారి ఉత్తర్వుల మేరకు పుస్తకాల డిజిటలీకరణకై దాదాపు రూ.4 లక్షలతో కొని, నేడు మూలన పడవేసిన పరికరాన్ని వాడుకలోకి తెచ్చేలా చూడాలి. ఉభయ తెలుగు రాష్ట్రల లోనే గొప్పదైన బ్రౌన్ గ్రంధాలయాన్ని బ్రతికించాలి. మిగిలి పోయిన "కైఫీయత్తుల" ప్రచురణ చేయాలి. బ్రౌన్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వర్తమాన పరిశోధన కొరకులకు విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది సాహిత్యకారులకు పట్టుకొమ్మగా నిలుస్తుందని సాహితీ స్రవంతి ఒక ప్రకటనలో తెలిపింది.

Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం