ఈ నేల నిశ్శబ్దంగా ఉంది
ఈ నేల నిశ్శబ్దంగా ఉంది
ఇక్కడి నేలలో పారే నీళ్లు ఎక్కడో ఇంకుతున్నాయి !
ఇక్కడి చెమట ధారలు ఎక్కడో ఆవిరవుతున్నాయి !
ఇక్కడి పౌరుషాలు వట్టి ప్రగల్పాలుగా మారి ఎక్కడో సమాధుల్లోకి చేరుతున్నాయి.
ఈనేల ఎందుకో నిశ్శబ్దంగా ఉంది..
చీకటి పొరల్లో నిద్రపోయిన కథలా!
ఒక్కొక్క గొంతుక విచ్చుకుంటే అప్పుడది రణన్నిదానంగా మారుతుందేమో
గనులు కొల్లగొట్టారు పారుతున్న నీళ్లను ఒడిసిపట్టలేకపోయారు
నేల నమ్ముతున్నారు
నెర్రలవుతున్న నేలను మాగాణం చేయలేకపోయారు.
ఇక్కడి బ్రతుకులు జీవచ్ఛావాలు
ఆశలనింపి హక్కులను తట్టి లేపే
నినాదం ఎప్పుడందుకుంటుందో.
ఎవడో వస్తాడని ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూస్తూన్న కనులు కళ్లెర్ర చేసేదెన్నడో...
నూరు టీఎంసీలు కావాలని ఒకవైపు
దశాబ్దానికోసారి పారే
సెలయేటిని ఒడిసిపట్టమని కోరుతున్న గొంతుకలు మరో వైపు
ఖాళీ చేతులకు పనులిమ్మని
ఆధునిక దేవలాలను నిర్మించమని అడిగే
వెలుగు నిప్పులు కురిపించే గొంతుకలు ఎప్పుడు గర్జిస్తాయో?
ఈ మౌనం ఎప్పుడు విరగబడి జలధారలై ప్రవహిస్తుందో?
____ పిళ్లా కుమారస్వామి,9490122229
Comments
Post a Comment