వద్దొద్దు తరలింపు


వద్దొద్దు తరలింపు

రాయలసీమ గుండె తడి
రాజకీయ నీలి మేఘానికి తెలుస్తుందా?
రాజధాని ఆశ ఎటూ పాయె!
ఉన్నత న్యాయం కను చూపు మేరలో కానరాలే
బెంచి బెంచి అంటూ అరిచి
ఏ బెంచీ లేని లేని చోట 
ఏమీ పాలు పోక దిక్కులు చూస్తున్నాము
మన కలల బడిలో 
ఏ అక్షరాల ప్రగతీ లేదు.
కురిసే చినుకు మాటుకు పోతే
ఉన్న ఆఫీసులన్నీ రాజధాని వైపు అడుగులేస్తే
నైపుణ్య కేంద్రాలు అదే బాట పడితే
సీమ గోడు వినేవాళ్లు ఎవరూ!
యువత కాళ్ళను ఉక్కుమయం చేస్తారని 
ఆధునిక దేవలాల లో
ఆనందపు గంటలు మ్రోగుతాయని
ఎదురుచూస్తున్న వేళ 
బ్రతుకు ఎండమావిగా మారుతుంటే
ఇది అవకాశం పంచే ప్రభుత్వమా?
అవకాశాల్ని తినే రాబందుల రాజ్యమా?
సీమ మన్ను తడిపే కన్నీటి చుక్క 
నీతి మరిచే పాలకులకు తెలుస్తుందా?
ఆవేదన రగిలి రగిలి 
సీమ గుండెలో నిప్పుల వేడి చెలరేగుతుంది
కవి గుండెలలో ఎగసే కవితా తుఫాను
తీరం దాటక ముందే 
పీఠాలను కబలిస్తుంది 
అభివృద్ధన్నది ఒక ప్రాంతానికి కాదు
అది ఎల్లలెరుగని 
సమానత్వ భావన
అదే లేని నాడు
అక్షరం నిప్పులు చిమ్ముకుంటూ
అధికారాన్ని దహించడం ఖాయం.

___ పిళ్లా‌ కుమారస్వామి,9490122229

Comments

Popular posts from this blog

Pilla Vijaya kumaraswamy Reddy

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం