srisri vardhanthi sabha

కష్టజీవికి కుడిఎడమల నడిచేవాడే కవి* 

సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బ్రౌన్ గ్రంధాలయంలో శ్రీ శ్రీ వర్ధంతి సభ జరిగింది ఈ సభకు అధ్యక్షులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ కదిలేది కదిలించేది మార్చేది మార్పించేది నవకవనానికి కావాలని శ్రీ శ్రీ కోరుకున్నాడని అన్నారు. అంతేగాక ఆయన కష్టజీవులకు ముందు నిలబడి "పదండి ముందుకు పదండి త్రోసుకు పదండి ముందుకు పదండి త్రోసుకు
నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి
 కనబడలేదా మరో ప్రపంచపు ఎర్రబావుటా నిగనిగలు
అగ్ని కిరీటపు ధగధగలు హోమజ్వాలపు బుగబుగలు అంటూ కష్టజీవులు వైపు నిలబడే వారందరినీ ఏకం కమ్మని పిలుపునిచ్చాడని అన్నారు. శ్రీశ్రీ కవిత్వం ఈనాటికి అజరామరంగానే ఉందని యువకులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. కొత్త తరం కవులకు దారి చూపుతోందని అన్నాడు.
శ్రీ శ్రీ కవిత్వం సమకాలీనత అనే అంశం పైన యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ‌ శ్రీ శ్రీ కవిత్వం కార్మికులకు మార్చింగ్ బ్యాండ్ లాగా పనిచేస్తుందని అన్నారు. ఆయన సాహిత్యాన్ని మొత్తంగా అధ్యయనం చేశాడన్నారు. నన్నయ తిక్కన ఎర్రన వీరు తెలుగు కవిత్రయం కాదని తెలుగు భాషకు సమాజం ముందుకు పోవడానికి వైతాళికులుగా ప్రాచీన కాలంలో నిలిచిన lతిక్కన మధ్యయుగాలలో ఎర్రన వేమన ఆధునిక కాలంలో గురజాడ వీరు ముగ్గురు కవిత్రయమని చెప్పారని అన్నారు. రాజకీయాలపై ఆయన చెప్పిన విరులు ఈనాటికి సమకాలీనత llసంతరించుకున్నాయని అన్నారు గుండ్రాలు గండ్రాలు విసిరే నేలలో అనడం ఆయన సాహిత్యానికి సజీవత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది అన్నారు. ఓక పదం గుర్తున్న శ్రీశ్రీ గుర్త్తుంటాడని చెప్పారు. కవి ఎలా ఉండాలో శ్రీశ్రీ ని చదవాలని చెప్పారు. ఈనాటి సమాజం మారాలంటే ఆనాటి వేదాల్లోనీ
మూఢనమ్మకాలను నమ్మలసిన అవసరం లేదన్నారు. భౌతిక దృక్పథం వైపు అడుగులు వేయాలని కవితలను రాశారు.
శ్రీశ్రీ కథలు సమకాలినత అనే అంశం మీద మాట్లాడుతూ డాక్టర్ పొదిలి నాగరాజు మాట్లాడుతూ శ్రీ శ్రీ కథలు ఎంతో సాహిత్య పరంగా తను రాసిన కవిత్వానికి మరో కోణంలో కథలను ఆవిష్కరించి కష్టజీవుల గురించి ఆయన తన కథల్లో పొందుపరిచారన్నారు డిటెక్టివ్ పతలు కూడా ఆయన రాశాడని అన్నారు కథల్లో జీవితం ఉంటుందని ఆయన కథల్లో జీవిత వైరుధ్యాలను చక్కగా సందర్శించి చిత్రించే విధానం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చాలా మంది కవులు తమ కవితలను వినిపించారు వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు ఈ సాహిత్య కార్యక్రమానికి పలువురు సాహితీకారులు హాజరయ్యారు. తెలుగు జన విజ్ఞాన వేదిక మహిళా నాయకురాలు సునీత, రచయిత్రి అరుణ, సిపిఎం నాయకులు దస్తగిరి, రామ్మోహన్, స్రవంతి జిల్లా కన్వీనర్నింగ్ ప్రసాద్ పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022