మామిడి


మామిడి

    మనదేశంలో మామిడికి అత్యంత ప్రాధాన్యత వుంది. పేరు వినగానే నోరుణించే ఫలము మామిడి. మామిడిని మనం ఎన్నోరకాలుగా వాడతాం. పచ్చళ్ళు, ఊరగాయలు, తినేం దుకు ఉపయోగించే పండ్లు... ఇలా ఎన్నో...

మన పెరటిలోకూడా కొన్ని మామిడిచెట్లు పెంచుకో వచ్చు. వీటివల్ల ఇంటికి చల్లదనంకూడావుంటుంది. మామిడిని మూడు నాలుగు రకాలుగా విభజింపవచ్చు.
అవి : 

1. రసాలు, 
2. ఊరగాయ రకాలు.
3. కోత రకాలు

పెరటిలో మనకున్న స్థలాన్నిబట్టి ఈ మూడు రకాల మొక్కలు ఒక్కొ క్రటయినా నాటితే ఈ మూడు రకాల కాయలు పొందవచ్చు.

రసాలలో ముఖ్యమయినవి చెరకు రసం, చిన్న రసం, పెద్ద రసం, పంచదార కలక, కొత్తపల్లి కొబ్బరి మొదలగునవి.

ఊరగాయ కాయలలో ముఖ్యమయినవి : సువర్ణ నగీ జలాల్, చిన్నరసాలు, 
కోతరకాలలో శ్రేష్టమయినది బరేంగి పల్లి, తరువాత చెప్పుకోతగినవి తోతాపురి, నీలం, 
జ హర్ గా మొదలగునవి.
వీటన్నింటిలో చాలా ఆలస్యంగా అంటే పదిహేను సంవత్సరాల తరువాత కాపుకు వచ్చేది బంగినపల్లి, మిగతా వన్నీ కూడా ఏడెనిమిది సంవత్సరాల నుంచి కాపు 
మొదలవుతాయి.

మొక్కలు నాటటానికి అంటు పద్ధతి ఉపయోగిస్తారు. ఇందుకుగాను మంచి రకమయిన అంట్లను ఎంచుకోవాలి.

అంట్లు నాటటానికి భూమిని మెత్తగా తవ్వుకోవాలి. తరువాత ఒక మీటరు పొడవు, వెడల్పు లోతు వుండేలాగ గోతులు తవ్వుకోవాలి.

గుంతకు గుంతకుమధ్య కనీసం పదిమీటర్ల దూరం వుండాలి. అప్పుడే చెట్టు బాగా ఎదిగినప్పుడు కొమ్మలు ఒక దానికొకటి అడ్డురాకుండా ఉంటాయి. 
గుంటలలో ఒక్కొక్క దానిలో నలభై యాభైకిలోల వరకు పశువుల ఎరువు, కంపోస్టు వేయాలి. దీనితోపాటు రెండుకిలోలు సూపర్ పాస్పేటు, వంద గ్రాముల బి.హెచ్.సి. పదిశాతం పొడిని వెయ్యాలి. బి.హెచ్.సి. మొక్కకు చెదలు పట్టకుండా రక్షి స్తుంది. ఇది గుంటలోని మట్టిలో కలపాలి. అంటు మొక్కను వేళ్ళదగ్గర ఉన్న మట్టితోసహా గుంతలో పాతిపెట్టి మట్టిని వేర్లపై కప్పి చెయ్యాలి. ఈ చిన్న మొక్కలు గాలికి పడి పోకుండా కర్రతో సపోర్టు ఏర్పాటు చెయ్యాలి. వర్షాలుతక్కువగా ఉండే కాలంలో మొక్కలు పాతటం మంచిది. మొక్కలకు తరచుగా నీరుపోస్తూ వుండాలి.

అంట్లు క్రింద చిగుళ్ళు రావటంమొదలవుతుంది. వీటిని తుంచివేస్తూ వుండాలి. ఇలా మొక్క కనీసం ఒక మీటరు ఎత్తు ఎదిగేవరకు చెయ్యాలి. తరువాత నుంచి పక్క కొమ్మలను పెరగనిచ్చి తలభాగాన్ని కత్తిరిస్తూ వుండాలి.

మొక్కలకు అప్పుడప్పుడు శనగపిండి, ఆముదం పిండి, వేపపిండి వంటివి వేస్తూ వుండాలి..

మొక్క వయస్సుని బట్టి ఇతర రసాయనిక ఎరువులు కూడా వెయ్యాలి. సంవత్సరం వయస్సున్న మొక్కకు వంద 'గ్రాముల భాస్వరం, వంద గ్రాముల పొటాష్, రెండువందల గ్రాముల నత్రజని అవసరం. ప్రతి సంవత్సరం మొక్క వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ రసాయనిక ఎరువులను కూడా ఇంచుమించు రెట్టింపు పరిమాణంలో వేస్తూ ఉండాలి.

ఎరువులను వర్షాకాలంలో వేయటం మంచిది. మొక్క పిందెలు వేసే సమయానికి మరోసారి ఎరువులు వెయ్యాలి. నీరు పెట్టాలి. ఎండాకాలంలో నీరు కొంచెం ఎక్కువగా పోస్తుండాలి.

సాధారణంగా అన్ని 'మామిడి రకాలలో నవంబర్ నుంచి పూత మొదలయి పిందెలు వేసి, ఏప్రిల్ నాటికి కాయ పక్వానికి వస్తాయి. అప్పుడు కాయని కోయవచ్చు.

ఈ కాపు జూన్ జూలై వరకు ఉండి ఆ తరువాత పూర్తిగా తగ్గిపోతుంది,

పూత తరచుగా రాలిపోతుంది. ఇలారాలకుండాఉండా లంటే నేఫ్తలిన్, ఆసిటి కామ్లాలను లీటరు నీటికి 20 మిల్లీ గ్రాములు చొప్పున కలిపి పంటమీద చల్లాలి. దీనిలో కొంచెం యూరియాను కూడా కలిపి చల్లుకోవచ్చు..

మామిడిమీద పెద్ద ఎత్తున నష్టం కలిగించేవాటిలో తేనె మంచుపురుగు ప్రధానమయినది. దీనిని నివారించడానికి పూత మొదలవగానే మొక్కపై 0.05శాతం నువాక్రాన్ని, ఒక లీటరు నీటిలో 125 మి.లీ. చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. తరువాత నెలరోజులకు మరోసారికూడా పిచికారీ చెయ్యాలి. ఇప్పుడు 0.2 శాతం గంధకాన్ని లీటరు నీటిలో నాలుగు గ్రాముల చొప్పున కలిపి మొక్కలమీద చల్లాలి. ఇది బూడిద తెగులునుకూడా అరికడుతుంది.

కాండం తొలిచే పురుగులుకూడా చెట్లకు బాగా నష్టం కలిగిస్తాయి. దీనిని అరికట్టటానికి 0.05% 50 శాతం ఇ.సి. సుమిధియాన్ని, లీటరు నీటిలో ఒక మి.లీ చొప్పున కలిపి చల్లుకోవాలి. ఈ వ్యాధి సోకి బాగా కుళ్ళిన కొమ్మలుంటే వాటిని తొలగించి పూర్తిగా తగలబెట్టటం మంచిది.

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు