వేమన పద్య పోటీలు





1.3.23 ను పట్నంలో ఉన్న ఓపెల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో వేమన పద్యాలు పోటీ నిర్వహించబడినది. ఆ పాఠశాల విద్యార్థులు చాలా ఉత్సాహంగా వేమన పద్యాలను అనర్గలంగా పాడి  తాత్పర్యంతో సహా చెప్పారు. వారందరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పట్నం ప్రముఖ వ్యవసాయవేత్త సాంబమూర్తి అధ్యక్షత వహించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు  కుమారస్వామి మాట్లాడుతూ వేమన  17వ శతాబ్దంలో జీవించిన ప్రజా కవి అని ఆయన  సమాజంలోని అనేక సామాజిక రుగ్మతల ను తన కవిత్వం ద్వారా ఖండించి ధ్వజమెత్తాడని చెప్పారు. వేమన 1670లో జన్మించాడని దాదాపు 80 ఏళ్లు జీవించిన తర్వాత 1750 ప్రాంతాలలో గాండ్లపెంట మండలంలోని కటారుపల్లెలో జీవ సమాధి పొందాడని చరిత్రకారులు భావిస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం  వేమన జయంతిని జనవరి 19న జరుపుకోవాలని నిర్ణయించిందన్నారు. వేమన పద్యాలు ప్రజలలో ఇప్పటికీ నానుతున్నాయి. వేమన పద్యం ప్రజలను జాగ్రత్తగా చేస్తుంది. వేమన పద్యం రానివాడంటూ ఆంధ్రదేశంలో ఉండడు. వేమన ను శతకకవిగా భావించారే గాని ఆయన ప్రజాకవిగా చాలా కాలం గుర్తించలేదన్నారు. సిపి బ్రౌన్ వేమన పద్యాల పై పరిశోధన చేసి అనేక పద్యాలను వెలుగులోకి తెచ్చారు. కార్యక్రమాధ్యక్షులు సాంబమూర్తి మాట్లాడుతూ పట్నం గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులు తెలుగు భాష పైన, వేమన పద్యాల పైన ఇష్టాన్ని కనపరచడం చాలా మంచి పరిణామం. తెలుగును ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదని అయితే ఇంగ్లీష్ పేరిట తెలుగు భాషను విస్మరించడం తగదని అన్నారు.ఈ కార్యక్రమంలో  పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులు అందజేయడం జరిగింది. ఓపల్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు "వుయ్ షల్ ఓవర్ కం" ,"మేము విజయం సాధిస్తాం అనే గీతాలను అభినయం ద్వారా  తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల కరెస్పాండెంట్ షఇనఓజ్, ప్రిన్సిపాల్ షీనా, ఉపాధ్యాయులు కుమారి,శిరీష్, లిఖిత పాల్గొన్నారు.
విద్యార్థులు లహరఈష్,భవ్య,మనోజ్,అనుప్రియ భాయి మొదలైన విద్యార్థులు వేమన పద్యాలను చదివి బహుమతులు పొందారు.




Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022