నాకో కల వచ్చింది


నాకో కల వచ్చింది రాత్రి.తమిళ నాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ గారు నాకు ఒక యూనివర్సిటీ కి వీసీగా చేసినట్లు ఆ పదవిని అందుకుని ఆ యూనివర్సిటీని అన్ని రంగాల్లో చక్కదిద్దినట్లు పేరు ప్రతిష్ఠలు పొందినట్లు నాకు ఒక కల వచ్చింది. అందులో అన్ని కాలేజీల్లో మరుగుదొడ్లను బాగు చేయించినట్లు, లైబ్రరీ బాగు చేయించి డిజిటల్ గా మార్చినట్లు,   రిక్రూట్మెంట్ జరిపి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కొద్దిపాటి రెకమండేషన్ ఆమోదించి నియామకం జరిపినట్లు కల వచ్చింది. ఎస్సీ ఎస్టీ రోస్టర్ తయారుచేసి వారందరికీ సముచితంగా వారి వాటా ప్రకారం వారికి ఉద్యోగాలు వచ్చేటట్లు ప్రమోషన్లు వచ్చేటట్టు చేసినట్లు కల వచ్చింది.క్రమశిక్షణా రాహిత్యం ఉన్న ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించి వారికి తగిన చర్యలు చేపట్టినట్లు కల వచ్చింది. ఈ కల నాకు కొత్తగా ఉంది. భిన్నంగా ఉంది. ఏ మాత్రం ఊహించనిది. 
26 రాత్రి శనివారం నాడు తెల్లారితే ఆదివారం ఈ కల వచ్చింది.(2022)

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022