కవితల తోట


నీ నడుము వంపు లో నా మనసు కరిగి ప్రవహిస్తోంది నీ అమృతకలశంలోకి

నీ తీయని స్వరం తీగలుగా సాగి సాగి
నా పిల్లన గ్రోవిలో సరిగమలు పలికిస్తున్నవి

రాత్రంతా నాభావాలు అక్షరాల నదిలో ఈదిఈది
ఉదయానికల్లా కవితలుగా మారి వాట్సాపు వొడిలో సేద తీరుతున్నాయి.

నీలోని స్నేహ పరిమళం అందరి మనసులను సుతారంగా తాకుతుంది. తప్పులు వెతికే వారు నీ వెనకాల గొణిగేవాళ్ళు చరిత్ర లో అనామకులౌతారు.

కమ్మటి కలలకు నీరాజనం నీరూపం...
ఆస్వాదించే హృదయానికది చంద్రోదయం

నీ చక్కని చిక్కని నల్లని రింగు లు తిరిగిన కురులు పై వాలిన మల్లెపూలు
నను రా రమ్మని పిలుచు చున్నవి అధర చుంబనం చేయమని

నీ మాటల మంత్రాలతో  ఏదో మాయచేసి
నా మనసును దోచేశావు
నీ చూపుల తూపులతో గాలం వేసి మనసంతా నువ్వయ్యావు
నా గుండె చప్పుడు 

సముద్రపు పొంగు లో అందమైన నురుగు
నీ హంపిసొంపుల పొంగులో
ఎగిసిపడుతోంది సోయగాల పరుగు

నేలకే నాట్యం నేర్పావే
గాలికే సంకెళ్లు వేశావే ముద్దమందారమా
నీతో పరిచయం
నన్నిలా చేసిందే ప్రియతమా

కనులు మూసినవేళ కలలో నీవే
కనులు తెరచినవేళ కనిపించేదీ నీవే

మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే
వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే

ఇందాక 
సన్నజాజిలా నడుము
నాట్యమాడింది
ఇప్పుడు
కురులలో
పూపరిమళం గుప్పుమంటోంది

నీ అందమైన సుతిమెత్తని పాదాల సవ్వడి 
నా మది లయలకు శృతి కలిపి కోయిల కొత్త పాట పాడటం మొదలెట్టింది.

దాపరికం లేని భోళాతనం పసి వాళ్ళ మనసు నీది.  నీ వంటి దేహ మృదుత్వం, మనసు మార్దవం నాలో ముచ్చటగొలుపుతుంది.

నీ రూపము చూడగ ఎద పెన్నాలాగా
   పొంగుతోంది
 నిను తలచిన  ప్రతి క్షణం ఎన్నో భావాలు
చిరుజల్లులా కురుస్తున్నాయి

 అనుభూతులు  ఎన్నని చెప్పను
నీతో ఊసులాడిన ఆనందపు క్షణాలు
నీ మనసును  తడిమినవి
మరపురాని తలుపులు

నీ కళ్ళు…
తెల్లటి రాత్రి పై వికసించే…నల్లటి చందమామలు!
బీడువారిన ఈ బండ గుండెల పై,
ప్రేమ వర్షం కురిపించే నీలిమేఘచారికలు!

ప్రకృతిలో నిండుగా పూసిన మధురం
నీ అధరాలపై కారిన రస గుళికల చందనమై
నీ కింది పెదాల మధ్య వూరిన
తీయని మకరందమవుతుంది

అధరం మధురం 
వదనం సుమధురం 
నయనం వికసితం 
హసితం గులాబీ రేకులచందం
హృదయం మకరంరం
గమనం కథాకళి
మధురాధిపతే నీ చుంబనం

తొలి సంజెకు తూరుపు ఎరుపు, మలి సంజెకు పడమర ఎరుపు!
తెలియదు నాకు పడమర తూరుపు
 తెలిసిందొకటే ఎరుపు నా చెలియ పెదవి ఎరుపు.

ఊసుల ఊయలలూగుతూ
మనమిద్దరం
దిగంతాల అంచుల
ఏకాంతంలో ఒక్కటై

రావే చెలియా
పరుగున రావే చెలి
నీకోసం
రమ్యమైన
ఉదయాన
పలకరించే
సమయమిదే...

 

వికసించే నీ కనుల
కనిపించేను శశిరేఖ..
బిగిసిన నీ పరువాలు
రేపెను చక్కిలిగింతలు

వాస్తవం వెక్కిరిస్తున్నా...
మనసు జోకొడుతున్నా
నీతలపే లోకంగా 
నీకోసం ఎప్పుడూ ఇలాగే ఎదురు చూస్తాంటాను

రెప్పలు మూసినవేళ కలవై కరుణిస్తావు
కనులు తెరిచినంతనే జ్ఞాపకంలా మిగిలిపోతావు


చేరుదామని పరుగులెడుతున్నవేళ దూరమవుతావు
నేను సొమ్మసిల్లి నీ నామజపం లో మునిగి నప్పుడు నీహృదయవీణను వినిపించి నను సేదతీరుస్తావు

నా మధుర భావ తరంగిణిలో 
ఓలలాడితే....
మంచువలే కరిగెను
నీ కోపతాపాలు...
వన్నెల వానలో 
తడిసెను మోహావేశాలు...!!

రోజూ నిరీక్షించే వాడంటే 
తేలిక భావం
అరుదైన వస్తువుకే
ధర ఎక్కువ

శ్రావణ సంధ్యా కిరణాలలో 
అరవిరిసిన మందారంలా
నా మేని పరిమళం
పలవరించేది కలవరించేది
నీ పేరే

నీ దగ్గర  ఒక్క నిమిషం
నిలవాలంటే భయం 
నా మనస్సు నీకు  వశమై 
నా  దగ్గరకు  రానంటుందేమో  అని

తళుక్కున మెరిసిన మెరుపుల్లో నింగిరూపం
తళతళలాడే అందాలతో నింగి నుంచి నేలకు దిగింది నీ రూపం

ఎంత చూసినా, ఎన్ని సార్లు చూసినా ఎప్పుడూ కొత్తగా కనబడుతుంది నీ రూపం
ఎన్నివిధాల వర్ణించినా
ఇంకా వర్ణించడానికి  కొత్తదనమే ఉంటుంది నీలో


ప్రకృతి లోని రంగులన్ని తెచ్చి నీ దోసళ్లలో పోయనా
నీ తమలపాకుల వంటి నీ కరములపై
నీ లేలేత పాద పద్మములపై
నీ పయ్యెద చాటున ఎద తలుపుపై
రంగురంగుల రంగవల్లి తో టాటూ వేయనా.

నా మనసొక వెన్న సంద్రం
నీ మనసోక మొండిఘటం
ఇద్దరినీ కలిపింది రెండక్షరాల బంధం
మనసులో నిలిచి పోయింది ఆ కమ్మని సంబంధం

సముద్రపు అలలు నీపాదాలను తాకి వేడెక్కిపోతున్నాయి.
పిల్లతెమ్మెరలు  నీ మేను సోకి పరవసిస్తున్నాయి.
మబ్బులు నీ  నీలి కళ్లను  మీనాలుగా భ్రమసి నీరుగారి పోతున్నాయి
నీ మనసుకు  రెక్కలొచ్చి నాతియ్యని కలల్లో ఎగురుతున్నాయి.

సీతాకోకచిలుక రెక్కల మృదుత్వంతో నిండిన నా హృదయం
నీ మనసు జలతారు కుచ్చులలో ఇరుక్కుపోయింది

నా చేతి వేళ్ళు సుతారంగా నీ పాదాలు అంచులను గీటినప్పుడు
నీ మానసవీణ హృదయతంత్రులు కంపించి
మధురలోయలో మకరందం తేనెలూరుతుంది.

మబ్బులోని నీటిముల్లులా
వెలుగు లోని కాంతిరేఖలా
మాటలోని తియ్యని భాషలా
ఎదలయలో లబ్ డబ్ లా
నిలిచిపోయావే ఓ చెలీ నా సఖీ.

అలలు కదిలినా నీవే, ఆకు కదిలినా నీవే
కలలు కదిలినా నీవే, కలత చెందినా నీవే
నీపై ఏ కవిత రాయనూ నీవే కవితగా మారి ఉంటే...

పాలలోని తెల్లదనం
తేనెలోని తియ్యదనం
వెన్నలోని కమ్మదనం
 వెన్నెలలోని చల్లదనం
పువ్వులోని మకరందం
మనసులోని స్వచ్ఛందం
పలుకులోనే ఉంది సహజందం
పైకి కనిపించే మేను కాదు
కనిపించని హృదయందం నువ్వు
అందుకే నువ్వందం
అది నాకెంతో ఆనందం

ఒకానొక సమయాన నా చూపుల జడిలో  నీ తనువు నిలువెల్లా తడిసి ముగ్ద అయింది.
తనువును తాకుతు జారిన చూపు అమృతవర్షణి రాగమై
నా మురళిని తట్టిలేపింది.

ప్రేమకు మూలం నీ మనసు
మోహానికి మూలం నీ తనువు
నా కవితా తోటలో విరిసిన ప్రేమ మకరందం నువ్వు.

నా గుండె చప్పుడులో
శ్వాసిస్తు
ప్రతి క్షణం
నేను..... అంటూ గుర్తు చేసే మానని గాయానివి నువ్వు..

ఇరవైదు వసంతాలు తిరుపతి మొదలుకొని ఇప్పటిదాకా నా ప్రేమ పరిమళం నీ చుట్టూనే తిరుగుతోంది చెక్కు చెదరకుండా. 
తన్నినా కొట్టినా తిట్టినా ... నీ చుట్టూనే నా శ్వాస తిరిగింది ఏం మాయ చేశావో ఏమో...
నీ కాలికి ముళ్లు గుచ్చుకుంటే నేను విలవిలలాడాను
నీ మువ్వల సవ్వడి కోసం ఎక్కడున్నా వచ్చి వాలాను
నువ్వు నల్లని వారిస్తున్నా నీ చంద్రబింబపు మోము చూస్తూ శ్వాసించాను.
నీ లోయగా నీ శ్వాస గా 
ఆఖరుకు నీ వంటి పై పాలే జలపాతానిగా 
ఎవరూ చూడని ఎవరూ చేయలేని నీ నెచ్చెలి గా మారాను..
నువు మాట్లాడకుంటే బాధ
నువు ఫోన్ తీయకుంటే వ్యథ
ఎందుకో అర్థం కాదు
ఇప్పటికీ వదలని ప్రేమ భావం
నీకు మాత్రం అది తొక్కలో ప్రేమ....
ఒక్కసారి వెన్నెల దారుల్లో మనం తిరుగాడిన క్షణాల్ని
ఒక్కసారి మనిద్దరం తిరుగాడిన నిమిషాలను 
నీ కోసం నా క్షణాలను పారేసిన దారులను చూడు
దారి వెంట ఎన్ని మైలురాళ్ళను దాటామో..
నేనెంతగా పరితపించానో
నీవెంతగా నన్ను విదిలించావో..
ఇప్పటికీ నీ చుట్టూ నే తిరుగుతున్న పరిమళాన్ని
మనసు గదిలో నిలిచిన ఓ పుష్పాన్ని...
ఏ దేవత గుడి చుట్టూ తిరిగినా వరాలు ఇచ్చేది ఎన్నో...
ఈ దేవత ఎప్పుడు వరమిచ్చేనో..
కనీసం ఐ లవ్ యూ అన్న ప్రేమ పిలుపు పలుకుకోసంనీ తలుపుల వాకిట నిలబడిన
ఓ  ప్రేమ పిపాసిని...

ఇపుడు వీస్తున్న వడగాల్పులలో చల్లని చిరుజల్లు నీ నవ్వు నా నువ్వు
కాలానికి కళ్లెం వేసి
వసంతరుతు శోభతో నిలిచిపోయింది నీ యవ్వనం

నీ అధరాలపై నా పెదవుల ముద్రవేయనా
వాడని నీ పూతోటలో నా వేణువు వాయించనా
నీ సంపెంగ మొగ్గ ల మకరందం మధించి గ్రోలనా

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022