పిళ్లా కుమారస్వామి

          
సాహితీ యవనికపై నిత్యం కదలాడే పిళ్లా కుమారస్వామి వాస్తవానికి వృత్తి రీత్యా జీవిత
భీమా సంస్థలో ఒక అభివృద్ధి అధికారి అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆయన వృత్తి రీత్యా
ఆర్థికరంగంలో వున్నా ప్రవృత్తి రీత్యా సాహిత్య రంగంలోకి తొంగి చూడటానికి కారణం ఆయన
కుటుంబనే పద్యం కావచ్చు. ఆయన తండ్రిగారు కీ. శే.పిళ్లా లక్ష్మిరెడ్డి  తెలుగు పండితులు. అన్నగారు, అక్కగారు కూడా తెలుగు పండితులే. బహుశా వీరి ప్రభావం వల్లనేమో వీరు కూడా తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించి ఉంటారు.

         పిళ్లా కుమారస్వామి 8.7.1964లో కడపజిల్లా రాజంపేటలోని సరస్వతీపురంలో జన్మించారు.
వీరు తల్లిదండ్రులు పిళ్లా రామలక్ష్మి, పిళ్లా లక్ష్మిరెడ్డి. తన చిన్నతనంలోనే తల్లి దివంగతురాలైంది.
ఆ తరువాత పదైదేళ్ళ ప్రాయంలో తండ్రి మరణించారు. దాంతో ఆయన తన అన్న పిల్లా
దశరథరామిరెడ్డిగారి దగ్గరే వుండి చదువు సాగించారు.
      1990లో కదిరిలో జీవిత బీమా సంస్థలో డెవలెప్ మెంట్ ఆఫీసరుగా కడప నుంచి వచ్చి
చేరినారు. ఒకవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే మరొక వైపు తనకు ఆసక్తి కలిగించిన జనవిజ్ఞాన
వేదికలో చేరి అనేక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచారం చేసినారు. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని గ్రామాలల్లో
ప్రజలను చైతన్యవంతం చేసినారు. ఆ సందర్భంలోనే విద్యార్థుల్లో సైన్సు పట్ల అభిరుచి ఏర్పడేందుకు
విద్యార్థులకు బాలోత్సవ్, సైన్సు ఫేర్ వంటివి నిర్వహించారు. పుస్తకాలను చదవాలని జనవాచక
ఆందోళన్ నిర్వహించారు. కదిరికి సమీపంలో వున్న కవులేపల్లిలో ఒక గ్రంథాలయాన్ని అక్కడి
యువకులతో స్వచ్ఛంధంగా ఏర్పాటుచేసి పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచినారు.
కొంతకాలం తరువాత కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలతో కలిసి అనేక కార్యక్రమాలు
నిర్వహించారు. విద్యుత్ సంస్థల ప్రవేటీకరణ, అంగన్‌వాడీల ప్రవేటీకరణలకు వ్యతిరేకంగా కార్మికులను చైతన్యపరచి పోరాటాలను నడిపారు. బీడీ కార్మికుల వ్యధలను చూచి చలించిన కుమారస్వామి వారి సమస్యలపై ఆందోళనలను పలుమార్లు చేసినారు.
        2002 నుంచి అనంతపురం వచ్చాక ఆయన భూమిక మారిపోయింది. ఆయన సాహిత్యరంగంపై మక్కువ పెంచుకుని అటు సాహితీ కార్యకర్తగా ఇటు సాహితీకారునిగా మారినారు. ఆయన జీవితనేపథ్యం నడిచిన బాట తన సాహితీ కృషికి తోడ్పడింది. సాహితీస్రవంతి సంస్థను
అనంతపురంలో ఏర్పాటుచేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించి కొత్త కవులను, రచయితలను
ప్రోత్సహిస్తూ వారికి చేయూతనిచ్చారు.
ప్రపంచీకరణ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రపంచీకరణ ప్రతిఘటనా వేదికగా సాహితీస్రవంతి
ఏర్పడింది. మతోన్మాదానికి వ్యతిరేకంగా స్పందించే వేదికగా సాహితీస్రవంతి అనేక సాహిత్యకారులను సమీకరించింది. ఆ సందర్భంలో పెళ్లి కుమారస్వామి 'ప్రపంచీకరణ పై పోటెత్తిన కవితాసంద్రం' పేరుతో ఒక వ్యాసాన్ని పుస్తకంగా 2005లో తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం గురజాడ, శ్రీశ్రీ, జాషువా వర్ధంతులను నిర్వహిస్తూ, విద్యార్థుల్లో సాహితీ సృజనను పెంచేందుకు అనేక సాహిత్య పోటీలు నిర్వహించేవారు. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కథ, కవిత్వంలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు.
2015లో 'అనంతకవితాస్వరాలు' పేరుతో అనంత కవుల కవిత్వాన్ని ప్రచురించారు. దీనికి
మల్లెలగారితో కలిసి తాను సంపాదకత్వం వహించారు. 2016లో 'అనంత సాహితీ సమాలోచన' పుస్తకాన్ని రాసి ప్రచురించారు. 2015లోనే 'మేడే-కార్మికుల హక్కుల దీక్షాదినం' పుస్తకం తాను రాసి ప్రచురించారు. 2017లో 'ఆధునిక సాహిత్య పరిణామక్రమం,
రాయలసీమ ఆధునిక సాహిత్య పరిణామక్రమం' పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు.
       తాను ఇంతకాలం రాసిన కవిత్వాన్ని 'మట్టిపోగు' పేరుతో ఒక కవితాసంపుటిగా
వెలువరించేందుకు సన్నహాలు చేస్తున్నారు. అలాగే 'విశద' పేరుతో పలుగ్రంథాలపై తాను రాసిన
సమీక్షా వ్యాసాలు సంకలనాన్ని వెలువరించారు.
జనవిజ్ఞాన వేదిక లో పని చేసిన అనుభవం ద్వారా,
న్యూట్రిలైట్ సంస్థ ద్వారా తీసుకున్న న్యూట్రీషన్ కోర్సు ద్వారా వచ్చిన అవగాహన తో 'ఆరోగ్యజీవనం' గ్రంధాన్ని 2021 ఏప్రిల్ లో వెలువరించారు. ఇటీవల 2021 నవంబరులో అనేక సాహిత్య వ్యాసాలను 'నిశిత' పేరుతో ప్రచురించారు.
     గురజాడ ఫౌండేషన్ వారు గురజాడ పురస్కారంతో ఆయనకు సత్కరించారు. ఏప్రిల్ 2017 నెలలో వేమన సాహిత్యంపై రాష్ట్రస్థాయిలో 250 సాహిత్య సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అనంతపురం పట్టణములో పెళ్లి కుమారస్వామి నిర్వహించారు. 2018లౌ జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొని ఆయన తన కవితను వినిపించారు. ఆ సందర్భంగా ఆయన సత్కరించబడ్డారు.
         సింగమనేని నారాయణ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగార్ల ప్రభావంతో ఆయన సాహితీ
విమర్శారంగంలో మార్క్సిస్టు దృక్పథాన్ని అలవర్చుకున్నారు. సాహితీ వ్యాసంగాన్ని అభిరుచిగా కొనసాగిస్తున్న పిళ్లా కుమారస్వామి సతీమణి లక్ష్మీదేవిగారు బి.ఏ. పూర్తిచేసినారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉండటం వల్లనే ఇదంతా సాధ్యమైందని ఆయన చెపుతుంటారు. ఆయనకు ఇద్దరు సంతానం ఒకమ్మాయి, ఒకబ్బాయి. అమ్మాయి శరత్ జ్యోత్స్న అబ్బాయి
పేరు యశ్వంత్.
        కుమార్తె జ్యోత్స్న బి.టెక్, యం.బి.ఏ., పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్ లో డెల్టా కంపెనీలో
మేనేజ్ మెంట్ బాధ్యత నిర్వహిస్తున్నారు. కుమారుడు యశ్వంత్ బి.టెక్ కోర్సును ఇటీవల ఫస్ట్ క్లాస్ లో పూర్తిచేసినారు. ఆయన కుటుంబం కదిరికి మారాక తనకుమార్తెకు వివాహం ఇటీవల కదిరిలో చేశారు.


Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

రాత్రి కల 27.3.2022