2020

6/2020
I recruit agents of 50
Open a political party after 5years
Write a novel which will be like a Mahabharat


https://youtu.be/V6pU2-xKuEk

కదిరి సాంస్కృతిక సామాజిక అభివృద్ధికి  ప్రత్యేక కృషి చేస్తాం
పుస్తకావిష్కరణ సభలో ఉద్ఘాటన
              __ ఎంఎల్ఎ సిద్దారెడ్డి

పిళ్లా కుమారస్వామి రెడ్డి రచించిన సాహిత్య సమీక్ష వ్యాసాల సంపుటి "విశద" గ్రంధాన్ని ఎంఎల్ఏ కార్యాలయం లో ఎంఎల్ఏ సిద్దారెడ్డి ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
పిళ్ళా కుమారస్వామి రెడ్డి
కదిరి ప్రాంతంలో మంచి సాహిత్య కృషి చేస్తున్నారన్నారు.కదిరి ప్రాంతం సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ఆయన రాసిన విశద గ్రంధాన్ని అందరూ ఆదరించాలని కోరారు.
కదిరి అభివృద్ధి కి కుమారస్వామి రెడ్డి ఎన్నికల ముందు అందరితో ప్రణాళిక కోరారని అందుకే ఆ ప్రణాళిక ప్రకారం కదిరి అభివృద్ధి కోసం
ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసుకుంటున్నా మన్నారు. కుమారస్వామి మరిన్ని రచనలు చేయాలని ఆయన కోరారు.కదిరి బాలికల కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేస్తున్న
కవిత  'విశద' పుస్తకాన్ని విశ్లేషిస్తూ కుమారస్వామి విశద గ్రంధంలో అనేక ఆధునిక భావాలతో నేడు వస్తున్న రచనలను విశ్లేషించారన్నారు.ఆయన
సామాజిక కార్యకర్త గా
సాహిత్య కారునిగా విశేష కృషి చేస్తున్నారన్నారు.విశదలో 25 పుస్తకాలపై సమీక్షలున్నాయి. అవి రాయలసీమ సామాజిక సాంస్కృతిక నేపథ్యాన్ని చర్చించాయన్నారు.ఇవన్నీ  వివిద అంశాల పట్ల ఆయనకున్న విశేష పరిజ్ఞానాన్ని తెలియ జేస్తోందన్నారు.
రచయిత కుమారస్వామి (పిళ్లావిజయ్) మాట్లాడుతూ
పుస్తకానికి ఆర్థిక సహాయాన్ని అందించిన కీ.శే.సిద్దారెడ్డి సతీమణి మహాలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రంధంలో ఎక్కువగా రాయలసీమ రచయితల గ్రంధాలపైనే విమర్శా వ్యాసాలున్నాయన్నారు.

కదిరిలో చాలా మంది సాహిత్య కారులున్నారని వారంతా వెలుగులోకి వచ్చి కదిరీపతి,వేమన ల సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
రాయలసీమ సామాజిక సాంస్కృతిక విషయాలు వెలుగులోకి రావడానికి ఈ గ్రంధాన్ని రాశానన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంధ స్వీకర్త లక్ష్మిదేవి, గ్రంధ సహాయకులుమహాలక్ష్మి,రోటరీ క్లబ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి,

అధ్యాపకులు జి.వి.రమణ, పారిశ్రామిక వేత్తలసంఘం జిల్లా సభ్యులు రమణ, సిపిఎం నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి పరిచయం

వేమన పద్య పోటీలు